Raguram Rajan : ఆప్ స‌ర్కార్ పై రాజ‌న్ ప్ర‌శంస

విద్య‌, వైద్యం పై ఫోక‌స్ బెట‌ర్

Raguram Rajan : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సార‌థ్యంలోని ఆప్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు బాగున్నాయ‌ని ప్ర‌శంసించారు. పాల‌నా న‌మూనాను దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్ర‌ధానంగా తాను గ‌త కొంత కాలం నుంచీ చెబుతూ వ‌స్తున్నాన‌ని విద్య‌, ఆరోగ్య సంర‌క్ష‌ణ పై ఫోక‌స్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఢిల్లీ స‌ర్కార్ పాఠ‌శాల‌ల నాణ్య‌త‌ను మెరుగు ప‌ర్చ‌డంపై ఎక్కువ‌గా దృష్టి పెట్టింద‌ని, దేశ మంతటా ఆప్ మోడ‌ల్ ను అనుస‌రించ‌డం లేదా అమ‌లు చేస్తే మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు రఘురామ్ రాజ‌న్(Raguram Rajan).

భార‌త ప్ర‌భుత్వం డిజిట‌లైజేష‌న్ జ‌పం చేస్తోంద‌ని కానీ మిగ‌తా ప్రాధాన్య‌త రంగాల‌ను ప‌క్క‌న పెట్టింద‌న్నారు. ఇది ఆర్థిక రంగానికి తీర‌ని న‌ష్టం చేకూరుస్తుంద‌న్నారు ర‌ఘురామ్ రాజ‌న్. ప్ర‌ధానంగా ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం ఈ రెండూ దేశానికి తీవ్ర ఇబ్బందులు క‌లిగిస్తాయ‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఆప్ స‌ర్కార్ కేవ‌లం విద్య‌, ఆరోగ్య రంగాల‌కు భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న ప‌రీక్ష‌ల‌లో ఢిల్లీ పాఠ‌శాల‌లలో చ‌దువుకున్న విద్యార్థులు టాప్ లో కొన‌సాగుతున్నారు. మాజీ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శంస ఆప్ స‌ర్కార్ కు ఒకింత బూస్ట్ ఇచ్చిన‌ట్ల‌యింది.

Also Read : Pawan Kalyan Jagan : జ‌గ‌న్ పై భ‌గ్గుమ‌న్న జ‌న‌సేనాని

 

Leave A Reply

Your Email Id will not be published!