Ajinkya Rahane : సౌరాష్ట్ర‌పై ర‌హానే సెంచ‌రీ

రంజీ ట్రోఫీలో సెన్సేష‌న్

Ajinkya Rahane  : ఫాం లేమితో నానా తంటాలు ప‌డుతూ కెరీర్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్టార్ ప్లేయ‌ర్ అజింక్యా ర‌హానే(Ajinkya Rahane )ఎట్ట‌కేల‌కు రాణించాడు. ఇప్ప‌టికే బీసీసీఐ చీఫ్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చాడు.

రంజీ ట్రోఫీలో ఆడి రాణిస్తేనే టెస్టు జ‌ట్టు ఎంపిక‌లో ప‌రిశీలిస్తామ‌ని స్ప‌ష్టం చేశాడు. దీంతో మ‌రో ఆట‌గాడు చ‌తేశ్వ‌ర్ పుజారా కూడా రంజీలో ఆడుతున్నాడు. వీరిద్ద‌రూ ఇప్పుడు రంజీ వేదిక‌గా త‌మ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంద‌న్న వాస్త‌వాన్ని గ్ర‌హించారు.

రంజీ ట్రోఫీ 2022 లో భాగంగా సౌరాష్ట్ర‌తో ఇవాళ ప్రారంభ‌మైన మ్యాచ లో అజింక్యా ర‌హానే 250 బంతులు ఎదుర్కొని 108 ప‌రుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, 2 సిక్స‌ర్లు ఉన్నాయి.

విచిత్రం ఏమిటంటే త‌న సార‌థ్యంలో ఆడిన పృథ్వీ షా సార‌థ్యంలో ర‌హానే రంజీలో ముంబై త‌ర‌పున ఆడుతున్నాడు. నాలుగో ప్లేస్ లో మైదానంలోకి దిగాడు. అజేయ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

ఇక ఆట విష‌యానికి వ‌స్తే ముంబై జ‌ట్టు కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పృథ్వీ షా నిరాశ ప‌రిచాడు. ఒకే ఒక్క ప‌రుగుతో వెనుదిరిగాడు.

ఆ త‌ర్వాత ఆక‌ర్షిత్ గోమెల్ కూడా 8 ప‌రుగులు చేశాడు. దీంతో జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో క్రీజు లోకి వ‌చ్చాడు అజింక్యా ర‌హానే(Ajinkya Rahane ). మొదట్లో కొంచెం త‌డ బ‌డినా ఆ త‌ర్వాత త‌న స్టైల్ లో రాణించాడు.

స‌ర్ఫ‌రాజ్ ఖాన్ కూడా 121 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 263 ప‌రుగులు చేసింది.

Also Read : త‌డ‌బ‌డినా దుమ్ము రేపాడు

Leave A Reply

Your Email Id will not be published!