Rahul Dravid : కెప్టెన్ల మార్పుపై ద్రవిడ్ కామెంట్స్
ఒక రకంగా కోచ్ పదవి సవాల్ లాంటిది
Rahul Dravid : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పదవి చేపట్టాక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఓ వైపు కరోనా ఇంకో వైపు ఆటగాళ్లను మార్చడం, కెప్టెన్లు ఒకరి తర్వాత ఇంకొకరు రావడం. విచిత్రం ఏమిటంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఎప్పుడైతే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ పదవికి విరాట్ కోహ్లీ తప్పు కోవడం మొదలు పెట్టాక ఇప్పటి వరకు ఎంపికైన రోహిత్ శర్మ పూర్తి కాలం బాధ్యతలు చేపట్టలేక పోయాడు.
ఈ మధ్య కాలంలో ఏకంగా ఆరుగురు కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఒక రకంగా చూస్తే ఇది విచిత్రం అనిపిస్తుంది. మరో వైపు ఈ ఏడాది కీలకమైన టి20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది.
ఈ తరుణంలో గెలిచే జట్టును ఎంపిక చేయడం సవాల్ గా మారింది. ఇప్పటి వరకు కోహ్లీ తప్పుకున్నాక భారత జట్టు కెప్టెన్లుగా కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ , శిఖర్ ధావన్ , రిషబ్ పంత్ , హార్దిక్ పాండ్యా మారారు.
ప్రస్తుతం ఐర్లాండ్ లో పర్యటించే టీమిండియాకు పాండ్యా కెప్టెన్ గా ఉన్నాడు. ఇలా వస్తూ పోతూ ఉంటే ఎలా జట్టును నడిపించాలన్నది హెడ్ కోచ్ పై ఆధారపడి ఉంటుంది.
ఈ మొత్తం చోటు చేసుకున్న పరిణామాలపై రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) సోమవారం స్పందించాడు. ఆడటం వేరు కోచ్ గా జట్టుకు ఉండడం వేరు. ఇది చాలా ఒత్తిడితో కూడుకున్నది ఉంటుందన్నారు.
Also Read : సరైన దారిలో వెళుతున్నాం – పంత్