Rahul Dravid : రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్
మానసిక ఇబ్బందుల వల్లే పక్కన పెట్టాం
Rahul Dravid : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆసిస్ తో జరగబోయే సీరీస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను కావాలనే పక్కన పెట్టడం జరిగిందన్నారు. వాళ్లకు ప్రస్తుతం విశ్రాంతి కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Rahul Dravid Comments Viral
ఈ ఇద్దరు ఆటగాళ్లను రెండు వన్డేలకు పక్కన పెట్టడంపై పెద్ద ఎత్తున ప్రశ్నలు నెలకొన్న తరుణంలో స్పందించాడు రాహుల్ ద్రవిడ్(Rahul Dravid). ఆయన మీడియాతో మాట్లాడారు. వారి స్థానంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
త్వరలోనే బీసీసీఐ ఆధ్వర్యంలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. సీనియర్ ఆటగాళ్లు కీలకం కానున్నారు. వారి సేవలు ఇంకా అవసరం పడతాయి. ఈ సీరీస్ లో పాల్గొనడం వల్ల అలసి పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నాడు.
ఎందుకు ఆ ఇద్దరిని తొలగించాల్సి వచ్చిందనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు రాహుల్ ద్రవిడ్. మానసికంగా, శారీరకంగా కొంత విశ్రాంతి కావాలని కోరుకోవడం వల్లనే తాము మినహాయింపు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. మరో వైపు అద్భుతంగా ఆడుతున్నప్పటికీ కేరళ స్టార్ క్రికెటర్ శాంసన్ ను పక్కన పెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Also Read : Chandra Babu Naidu : చంద్రబాబు బయటకు వచ్చేనా