Rahul Dravid : భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ తో సీరీస్ ముగిశాక శ్రీలంక జట్టుతో ఆడే టీంలో వృద్ధి మాన్ సాహాను ఎంపిక చేయక పోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.
తనను తీసుకుంటానని బీసీసీఐ చీఫ్ గంగూలీ చెప్పాడని, కానీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid )మాత్రం రిటర్మైంట్ ప్రకటించే విషయాన్ని ఆలోచించమని చెప్పాడంటూ సాహా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ కామెంట్స్ భారత క్రికెట్ లో కలకలం రేపాయి. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఈ తరుణంలో రాహుల్ ద్రవిడ్ ఇవాళ స్పందించాడు. వృద్ధి మాన్ సాహా తనపై చేసిన వ్యాఖ్యలకు తానేమీ బాధ పడటం లేదన్నాడు.
అతడి బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పాడు. కొన్ని సంవత్సరాలుగా భారత జట్టుకు సేవలు అందిస్తున్నాడని ఈ సమయంలో ఎంపిక కాక పోవడం ఎవరినైనా బాధకు గురి చేస్తుందన్నాడు.
సాహా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడంలో తప్పు లేదన్నాడు. ఆ స్థానంలో తాను ఉన్నా కామెంట్ చేసే వాడిని కాదని కానీ బాధ పడే వాడినని పేర్కొన్నాడు.
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేనంత పోటీ ఒక్క భారత జట్టులో ఉందని స్పష్టం చేశాడు రాహుల్ ద్రవిడ్. టీమిండియాలో చోటు కోసం హోరా హోరీ గా యుద్దం నడుస్తోందన్నాడు.
ఎవరిని తీసుకోవాలో తెలియడం లేదన్నాడు. ఉన్న జట్టులో 11 మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ఇ
ప్పుడు ప్రత్యామ్నాయంగా 30 మంది ఆటగాళ్లు ఆడేందుకు రెడీగా ఉన్నారని చెప్పాడు.
Also Read : బుమ్రాపై సన్నీ ప్రశంసల జల్లు