Harbhajan Singh : రాహుల్ ద్రవిడ్ కు మరొకరు కావాలి – భజ్జీ
రోహిత్ శర్మది పేలవమైన కెప్టెన్సీ
Harbhajan Singh : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్(Harbhajan Singh) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో భారత జట్టు ఆట తీరుపై తాజా, మాజీ ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
ప్రధానంగా బీసీసీఐని, సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మను ఏకి పారేస్తున్నారు. ఈ తరుణంలో హర్భజన్ సింగ్ సీరియస్ గా స్పందించారు. జట్టు ఎంపికలోనే ఏదో లోపం ఉంది. ఇదే సమయంలో అత్యంత పేలవమైన నాయకత్వ వైఫల్యం కనిపించింది ఇంగ్లండ్ తో ఆడుతున్న సమయంలోనని పేర్కొన్నారు హర్భజన్ సింగ్.
ఇదే సమయంలో చాలా మంది రోహిత్ శర్మను తీసి వేయాలని , అతడు టి20 జట్టుకు నాయకుడిగా పనికి రాడంటున్నారు. కానీ ఇదే సమయంలో కెప్టెన్ కు ఎంత బాధ్యత ఉంటుందో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కూడా అంతే బాధ్యత ఉంటుందని ఎందుకు అనుకోవడం లేదంటూ ప్రశ్నించాడు మాజీ క్రికెటర్(Harbhajan Singh).
తాను కావాలని ద్రవిడ్ గురించి కామెంట్ చేయడం లేదన్నాడు. కాక పోతే ద్రవిడ్ తో తాను కలిసి ఆడానని, గొప్ప క్రికెటర్ అంతే కాదు అద్భుతమైన ప్రతిభ కలిగిన వ్యక్తి అంటూ కొనియాడారు. హెడ్ కోచ్ కు అదనపు కోచ్ ను నియమించాల్సిన అవసరం ఉందని సూచించాడు బీసీసీఐకి.
Also Read : న్యూజిలాండ్ టూర్ కు బయలు దేరిన భారత్