Rahul Gandhi : ప్రధాని మోదీకి గుణపాఠం తప్పదు – రాహుల్
తెలంగాణ భారత్ జోడో యాత్రలో గాంధీ
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ యాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది.
తమిళనాడుతో పాటు కర్ణాటక, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పూర్తయింది పాదయాత్ర. ప్రస్తుతం తెలంగాణలో 16 రోజుల పాటు కొనసాగి వచ్చే నెల నవంబర్ 7న ఎంట్రీ కానుంది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .
దేశంలో మోదీ నేతృత్వంలో కొనసాగుతున్న పాలన రాచరికాన్ని తలపింప చేస్తోందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందారంటూ ఆరోపించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేవలం కొందరికే లబ్ది చేకూర్చుతూ దేశ వనరులను అప్పగించారంటూ ధ్వజమెత్తారు.
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని రీతిలో మోదీ ఇలాఖాలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సర్కార్ కు గుణపాఠం తప్పదన్నారు రాహల్ గాంధీ.
ప్రతి ఏడాదికి 2 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన మోదీ ఎందుకు నెరవేర్చ లేదంటూ ప్రశ్నించారు. మాయమాటలతో మభ్య పెట్టడం తప్పా ఇప్పటి వరకు దేశానికి ఉపయోగపడే ఏ ఒక్కటి చేయలేదని ధ్వజమెత్తారు.
అత్యాచారాలు, హత్యలు, మోసాలు గత ఎనిమిదేళ్లలో భారీగా పెరిగాయన్నారు రాహుల్ గాంధీ. అంతకు ముందు చిన్నారులు, యువకులతో కలిసి పరుగులు తీశారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత వారితో కలిసి డ్యాన్సులు చేశారు.
Also Read : బీజేపీ గుర్తింపును ఈసీ రద్దు చేయాలి