Rains: తెలంగాణాలో పలుచోట్ల అకాల వర్షాలు ! మరో రెండు రోజులు భారీ వర్ష సూచన !
తెలంగాణాలో పలుచోట్ల అకాల వర్షాలు ! మరో రెండు రోజులు భారీ వర్ష సూచన !
Rains : ఎండలు మండుతున్న వేళ… తెలంగాణాలో(Telangana) పలు చోట్ల అకాల వర్షాలు కురిశాయి. శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా.. సాయంత్రం కురిసిన వర్షంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోనే ఈ అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ధర్మపురి మండలంలో ఈదురుగాలులతో కూడిన వానకురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నేరేళ్ల, తుమ్మేనాల, ధర్మపురి, తిమ్మాపూర్‌తో పాటు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోనూ భారీ వర్షం పడింది. భారీ వర్షాలు పడటంతో రైతులకు కొంతమేర నష్టం కలిగింది.
Rains in Telangana
తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల కారణంగా… వేడి తీవ్రతతో పాటు వడగాలులు సైతం తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనితో రెండు రోజుల పాటు ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం పొందనున్నారు
ఎండలు మండిపోతున్న వేళ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం అకాల కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో పలుచోట్ల వర్షం కురవగా… మరికొన్నిచోట్ల వడగళ్లతో పడిన వానలకు పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వర్షం కురిసింది. ధర్పల్లిలోని వాడి గ్రామంలో వడగళ్ల వానకు వరిధాన్యం నేలరాలింది.
మెదక్ పట్టణంలోని జంబికుంట వీధిలో ఓ ఇంటిపై పిడుగు పడింది. దీంతో సిద్ధయ్య అనే వ్యక్తి ఇంట్లో సామగ్రి ధ్వంసమైంది. ఆ సమయంలో మనుషులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కరీంనగర్‌లోని చొప్పదండి మార్కెట్లో మొక్కజొన్న తడిసిపోయింది. మెదక్ పట్టణం, మెదక్, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి మామిడికాయలు నేలారాలాయి. సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక, మిర్దొడ్డి, తొగుట మండలాల్లో వర్షం కురిసింది.
Also Read : Justice Yashwant Varma: ఢిల్లీ హైకోర్టు జడ్జి బంగ్లాలో అగ్నిప్రమాదం ! బయటపడ్డ నోట్ల కట్టలు !