Rajasthan Royals Top : మరోసారి టాప్ లోకి చేరిన రాజస్థాన్
మూడో స్థానంలోకి చెన్నై సూపర్ కింగ్స్
Rajasthan Royals Top : ఐపీఎల్ 16వ సీజన్ లో మరోసారి టాప్ లోకి దూసుకెళ్లింది సంజూ శాంసన్ సేన. నిన్నటి దాకా టాప్ లో కొనసాగుతూ వచ్చిన ధోనీ సేన రాజస్థాన్ రాయల్స్ చేతిలో 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో తిరిగి నెంబర్ 1 లోకి చేరింది రాజస్థాన్.
భారీ తేడాతో పరాజయం మూటగట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానంలోకి దిగజారింది. సీఎస్కే 7 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ లలో గెలిచి 10 పాయింట్స్ సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals Top) జట్టు 8 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ లలో గెలుపొంది 10 పాయింట్లతో +0.939 నెట్ రన్ రేట్ తో టాప్ లోకి దూసుకు వెళ్లింది. ప్రస్తుతానికి టాప్ 5 జట్లను చూస్తే రాజస్థాన్ టాప్ లో కొనసాగుతుండగా గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ లలో విజయం సాధించి 10 పాయింట్లతో రెండో స్థానంలోకి చేరింది.
ఆ జట్టు రన్ రేట్ +0.580 కలిగి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ +0.376 నెట్ రన్ రేట్ తో మూడో ప్లేస్ లోకి చేరింది. నాలుగో స్థానంలో కేఎల్ సారథ్యంలోని లక్నో సూపర్ కింగ్స్ ఇప్పటి దాకా 7 మ్యాచ్ లు ఆడింది. 4 మ్యాచ్ లలో గెలుపొందింది. 8 పాయింట్స్ సాధించి +0.547 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఇప్పటి దాకా ఐపీఎల్ టైటిల్ అందుకోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 మ్యాచ్ లలో గెలుపొంది 8 పాయింట్లు సాధించింది. ఐదవ స్థానంలో కొనసాగుతోంది.
Also Read : సూర్య కుమార్ పై భజ్జీ కామెంట్స్