RajiniKanth : అన్నీ ఉన్నా శాంతి లేద‌ని ‘త‌లైవా’ ఆవేద‌న‌

దిగ్గ‌జ న‌టుడు ర‌జ‌నీకాంత్ కామెంట్స్

RajiniKanth : భార‌త దేశ సినీ చ‌రిత్ర‌లో దిగ్గ‌జ న‌టుడిగా పేరొందిన త‌లైవా ర‌జ‌నీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బ‌స్ కండ‌క్ట‌ర్ గా జీవితాన్ని ప్రారంభించిన గైక్వాడ్ చివ‌ర‌కు సినిమాల మీద ప్రేమ‌తో ఎంట్రీ ఇచ్చాడు.

చూసేందుకు న‌ల్ల‌గా ఉన్న అత‌డిని సినిమాల‌కు ప‌నికి రాడ‌న్నారు. కానీ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కె. బాల‌చంద‌ర్ అత‌డిలోని స్పార్క్ ను, మేన‌రిజాన్ని గుర్తించాడు.

వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించాడు. ఆ త‌ర్వాత కోలీవుడ్ లో టాప్ న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు. బాల‌చంద‌రే గైక్వాడ్ కు ర‌జ‌నీకాంత్ అని పేరు పెట్టాడు. ఏ ముహూర్తంలో పేరు పెట్టాడో కానీ ఆనాటి నుంచి నేటి దాకా అద్భుత‌మైన స‌క్సెస్ చూశాడు.

చిటికేస్తే వేలాది మంది అభిమానులు ఆయ‌న ముందు వాలిపోతారు. ప్ర‌ధానంగా త‌మిళ వాసులు అత‌డిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఈ దిగ్గ‌జ న‌టుడి స్పెషాలిటీ మేన‌రిజం.

అందుకే అత‌డంటే అంత అభిమానం. ర‌జ‌నీకాంత్ కు హిమాల‌యాల‌న్నా, మంత్రాల‌యంలోని రాఘ‌వేంద్ర స్వామి అంటే చ‌చ్చేంత అభిమానం.

తాజాగా త‌న జీవితానికి సంబంధించి త‌లైవా ర‌జ‌నీకాంత్(RajiniKanth) చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. త‌న‌కు అన్నీ ఉన్నా ఏదీ లేన‌ట్టు అనిపిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

చేతినిండా డ‌బ్బులు. లెక్కించ లేనంత‌గా బ్యాంక్ బ్యాలెన్స్ లు, కోట్లాది మంది అభిమానులు, ఊహంచ‌ని రీతిలో ఆస్తులు అన్నీ ఉన్నాయి.

ఎక్క‌డికి వెళ్లినా ప‌ల‌క‌రించే మ‌నుషులు ఉన్నా ఎందుక‌నో త‌న జీవితంలో 10 శాతం కూడా సంతోషం అన్న‌ది లేకుండా పోయింద‌న్నారు ర‌జ‌నీకాంత్.

Also Read : సూర‌రై పొట్రుకు అవార్డుల పంట

Leave A Reply

Your Email Id will not be published!