Rakesh Tikait Chaduni : కేంద్రం మోసం రైతన్నల ఆగ్రహం
10 వేల కేసుల్లో 86 కేసులే ఎత్తివేత
Rakesh Tikait Chaduni : సాగు చట్టాలు రద్దు చేయాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా సారథ్యంలో చేపట్టిన ఆందోళన ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. చివరకు ఎంతో మంది రైతులు చని పోయారు. అదే సమయంలో పెద్ద ఎత్తున ఏకంగా 10 వేలకు పైగా రైతులపై కేసులు నమోదయ్యాయి.
చివరకు ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగొచ్చారు. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆపై బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దేశానికి క్షమాపణలు చెబుతున్నట్లు స్పష్టం చేశారు మోదీ. సాగు చట్టాలు రద్దు కావడంతో రైతులు శాంతించారు.
ఇదే సమయంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. ఆయా రైతు సంఘాల నేతలతో కేంద్ర సర్కార్ పలుమార్లు భేటీ అయ్యింది. ఇందులో భాగంగా ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడం, ఆందోళన సమయంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్ట పరిమారం ఇస్తామని , రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తి వేస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కేవలం 86 కేసులు మాత్రమే ఎత్తి వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు రాకేష్ టికాయత్(Rakesh Tikait) , గుర్నామ్ సింగ్ చడూనీ.
కేంద్ర సర్కార్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పై నిప్పులు చెరిగారు.
ఇకనైనా కేంద్రం తన తప్పు తెలుసుకుని నమోదు చేసిన కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
Also Read : వ్యవసాయ రంగానికి కేంద్రం ఊతం