Randeep Surjewala : బీజేపీకి మంగళం కాంగ్రెస్ కు అందలం
రాష్ట్రంలో బీజేపీ సర్కార్ విఫలం
Randeep Surjewala : కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రణ్ దీప్ సూర్జేవాలా. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. బుధవారం రణ్ దీప్ సూర్జేవాలా మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం ప్రజలు తమ పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నారని, రాబోయే కాలంలో తామే పవర్ లోకి వస్తామని జోష్యం చెప్పారు. బీజేపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు రావడం ఖాయమన్నారు.
ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను ఎంపిక చేసే స్థితిలో ఆ పార్టీ లేదన్నారు రణ్ దీప్ సూర్జేవాలా(Randeep Surjewala). ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి శక్తితో పోరాటం కొనసాగుతుందన్నారు. ఇదిలా ఉండగా తాము ఎంపిక చేసిన అభ్యర్థులను టార్గెట్ చేస్తూ దాడులు చేయించేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను పంపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
బీజేపీ చౌకబారు నిర్ణయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు రణ్ దీప్ సూర్జేవాలా. బీజేపీ తన అభ్యర్థులను ఎంపిక చేయలేక పోతోందని తమ వద్ద ప్రామాణికమైన సమాచారం ఉందన్నారు. ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్ల చైర్మన్లు పదుల సంఖ్యలో బీజేపీకి గుడ్ బై చెప్పారని, కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు.
Also Read : రాహుల్ అనర్హత వేటుపై థరూర్ ఫైర్