Durga Bai Deshmukh : ధీర వ‌నిత ‘దుర్గా భాయ్’

జూన్ 9న వ‌ర్ధంతి

Durga Bai Deshmukh : భార‌త రాజ్యాంగ నిర్మాత‌లలో ఒక‌రు దుర్గా భాయ్ దేశ్ ముఖ్(Durga Bai Deshmukh). చిన్న త‌నంలోనే పెళ్లి చేసుకున్నా అంచెలంచెలుగా జాతీయ స్థాయిలో నాయ‌కురాలిగా ఎదిగారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని రాజ‌మండ్రి దుర్గా భాయ్ దేశ్ ముఖ్ ది. స్వాతంత్ర ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు. సామాజిక సంక్షేమానికి త‌న జీవితం మొత్తం ధార పోసిన ధీర వ‌నిత ఆమె.

అంతే కాదు న్యాయ వాదిగా , స‌మ‌ర యోధురాలిగా , రాజ‌కీయ నాయ‌కురాలిగా త‌న‌ను తాను మ‌ల్చుకున్నారు దుర్గా భాయ్ దేశ్ ముఖ్. మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ కావాల‌ని, వారికి కూడా ఓ మ‌న‌సు ఉంటుంద‌ని నిన‌దించిన అరుదైన నాయ‌కురాలు. చిన్న‌త‌నంలో ఉన్న‌ప్పుడే మ‌హాత్ముడు మోహ‌న్ దాస్ క‌ర‌మ్ చంద్ గాంధీ చేప‌ట్టిన స‌హాయ నిరాక‌ర‌ణ ఉద్య‌మంలో పాల్గొన్నారు.

ఆనాడు కాకినాడ‌ను సంద‌ర్శించిన గాంధీ కోసం క‌ష్ట కాలంలో రూ. 5 వేల రూపాయ‌లు సేక‌రించి ఇచ్చింది దుర్గా భాయ్ దేశ్ ముఖ్. ఖాదీని ప్రోత్స‌హించేందుకు గాను దుస్తులు ధ‌రించింది. ఇంగ్లీష్ భాష‌ను వ్య‌తిరేకించింది. స్వంతంగా హిందీ విద్య కోసం స్వంతంగా బాలికా హిందీ బ‌డిని స్టార్ట్ చేసింది. లా చ‌దివి చెన్నై హైకోర్టులో ప్రాక్టీస్ చేసింది.

అంతే కాదు భార‌త దేశంలో అత్యున్న‌త‌మైన ఆర్థిక సంస్థ భారతీయ రిజ‌ర్వ్ బ్యాంక్ కు మొద‌టి గ‌వ‌ర్న‌ర్ గా 1953లో ప‌ని చేశారు దుర్గా భాయ్ దేశ్ ముఖ్. కేంద్రంలో ఆర్థిక మంత్రిగా కూడా కొలువు తీరిన ఘ‌న‌త ఆమెది. మూడు సార్లు జైలుకు వెళ్లి వ‌చ్చారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మ‌న్ గా ప‌ని చేశారు. జూన్ 9, 1981లో క‌న్ను మూశారు. ఇవాళ దేశ్ ముఖ్ వ‌ర్దంతి.

Also Read : Dyrga Bai Deshmukh : ధీర వ‌నిత ‘దుర్గా భాయ్’

Leave A Reply

Your Email Id will not be published!