Ratan Tata : మిస్త్రీ పిటిషన్ తిరస్కరణ టాటా స్పందన
ఈ తీర్పు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచింది
Ratan Tata : సైరస్ మిస్త్రీ తనను అన్యాయంగా తొలగించారంటూ టాటా గ్రూప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు.
దీనిపై టాటా గ్రూప్ సంస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా(Ratan Tata) స్పందించారు. ఆయన న్యాయ వ్యవస్థపై ఆసక్తికర , కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది మార్చిలో సైరస్ మిస్త్రీ తొలగింపు సక్రమమేనంటూ న్యాయస్థానం ఆమోదించింది.
అతనిని తిరిగి నియమించిన కంపెనీ లా ట్రిబ్యునల్ ఆర్డర్ ను పక్కన పెట్టింది. ఈ సందర్భంగా దీనిపై రతన్ టాటా(Ratan Tata) ట్వీట్ చేశారు. ఇది మన న్యాయ వ్యవస్థ విలువను పెంచిందని, నైతికతను బలపర్చేలా తీర్పు వెలువరించిందంటూ పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ చైర్మన్ టాటా 2021 లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని సైరస్ మిస్త్రీకి చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు.
కోర్టు ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల తర్వాత తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. విలువల వ్యవస్థను, న్యాయ వ్యవస్థ నైతికతను ఇది మరింత బలపర్చేలా ఉందంటూ కితాబు ఇచ్చారు.
గురువారం సర్వోన్నత న్యాయ స్థానం ఆమోదించిన, సమర్థించిన తీర్పుపై మా ధన్యవాదాలు అని పేర్కొన్నారు రతన్ టాటా. 2016లో టాటా సన్స్ చైర్మన్ గా ఉన్న మిస్త్రీని నాటకీయంగా తొలగించారు.
మిస్త్రీ మార్చి 2021 నాటికి కోర్టు ఉత్తర్వులను పునః పరిశీలించాలని , తనకు వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరారు.
Also Read : రతన్ టాటా సింప్లిసిటీకి జనం ఫిదా