Ratan Tata : రతన్ టాటా సింప్లిసిటీకి జనం ఫిదా
భద్రత లేకుండానే నానో కారులో తాజ్ సందర్శన
Ratan Tata : ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన ఆయన తమ సంస్థకు చెందిన తాజ్ హోటల్ ను సందర్శించారు.
భద్రతా సిబ్బంది, అనుంగు అనుచరులు లేకుండానే తాను ప్రేమించే నానో కారులో తన ఇంటి నుంచి తాజ్ కు వచ్చారు. ఎలాంటి హంగు ఆర్భాటం సెక్యూరిటీ లేకుండా వచ్చిన తమ సంస్థ చైర్మన్ రతన్ టాటా(Ratan Tata) కు ఘన స్వాగతం పలికారు సిబ్బంది.
ప్రస్తుతం రతన్ టాటా సందర్శించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కోట్లాది రూపాయలు ఉన్నప్పటికీ అత్యంత సాధారణ జీవితాన్ని గడిపే రతన్ టాటాను చూసి దేశం గర్విస్తోందని, యావత్ భారత్ ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అంటున్నారు నెటిజన్లు.
మరికొందరు రతన్ టాటా భారతీయుడైనందుకు గర్వపడాలని పేర్కొన్నారు. మరికొందరు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రతన్ టాటా(Ratan Tata) ఏది చేసినా ప్రచారం కోసం చేయరు. వ్యాపారంలో లాభాల కంటే విలువలే ప్రధానమని నమ్ముతారు.
తన సిబ్బందిని కంటికి రెప్పలా చూసుకునే టాటా అంటే టాటా గ్రూప్ సంస్థల ఉద్యోగులకు అపారమైన గౌరవం. భక్తి కూడా. రతన్ టాటా భారత దేశంలో నెంబర్ వన్ వ్యాపారవేత్తగా ఉన్నారు.
ఆయన ప్రచారానికి దూరంగా ఉంటారు. ఆయన సింప్లిసిటీకి కోట్లాది జనం ఫిదా అవుతున్నారు. చాలా సరళంగా, సాధారణంగా, వినయంగా ఉన్నారు టాటా అంటూ కొందరు ట్వీట్ చేశారు.
మరికొందరు టాటా కాలంలో మనం జీవిస్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇంకొందరు రతన్ టాటాను లివింగ్ లెజెండ్ అంటూ కితాబు ఇచ్చారు.
Also Read : డీల్ కుదిరింది షేర్ ధర పెరిగింది