Ravichandran Ashwin : టెస్టు ర్యాంకింగ్స్ లో అశ్విన్ టాప్

రెండో స్థానంలో జేమ్స్ అండ‌ర్స‌న్

Ashwin Test Rankings : భార‌త క్రికెటర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టు ప‌రంగా బౌలింగ్ లో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టు సీరీస్ లో 2-1 తేడాతో టీమిండియా సీరీస్ చేజిక్కించుంది. ఈ సీరీస్ లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్ ను ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లండ్ స్టార్ బౌల‌ర్ గా పేరొందిన జేమ్స్ అండ‌ర్స‌న్ ను దాటేశాడు భార‌త బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్(Ashwin Test Rankings).

మ‌రో వైపు 2022లో బంగ్లాదేశ్ తో సెంచ‌రీ చేశాక సుదీర్ఘ కాలం పాటు అంత‌గా ప్ర‌భావం చూప‌లేక పోయాడు భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ , స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన చివ‌రి నాలుగో టెస్టులో 186 ర‌న్స్ చేశాడు కోహ్లీ. దీంతో ఆయ‌న ర్యాంకు పెరిగింది. ఏకంగా ఏడు స్థానాలు దాటి 13వ స్థానానికి చేరుకున్నాడు.

ఇక బ్యాటింగ్ ప‌రంగా ప్ర‌క‌టించిన ర్యాంకుల‌లో భార‌త జ‌ట్టు స్కిప్ప‌ర్ రోహిత్ శ‌ర్మ తో పాటు గాయం కార‌ణంగా ఆట‌కు దూరంగా ఉన్న రిష‌బ్ పంత్ 9వ స్థానంలో కొన‌సాగుతుండ‌డం విశేషం. కెప్టెన్ 10వ స్థానంతో స‌రి పెట్టుకున్నాడు. ఇక ర‌విచంద్ర‌న్ అశ్విన్(Ashwin Test Rankings)  కు 869 పాయింట్లు సాధిస్తే అండ‌ర్స‌న్ 859 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక టాప్ 10 బౌల‌ర్ల జాబితాలో బుమ్రా 7వ స్థానంలో , ర‌వీంద్ర జ‌డేజా 9వ ర్యాంకులో కొన‌సాగుతున్నారు. ఇక ఆల్ రౌండ‌ర్ల జాబితాలో అశ్విన్ టాప్ లో కొన‌సాగ‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : శాంస‌న్ కు ఛాన్స్ ద‌క్కేనా

Leave A Reply

Your Email Id will not be published!