Ravi Shastri Malik : టి20 వరల్డ్ కప్ కు ‘మాలిక్’ వద్దు
భారత క్రికెట్ మాజీ హెడ్ కోచ్
Ravi Shastri Malik : భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సంచలన కామెంట్స్ చేశాడు. జమ్మూ కాశ్మీర్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్(Ravi Shastri Malik) పై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
సౌతాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టీ20 సీరీస్ కు భారత జట్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. కానీ ఢిల్లీలో జరిగిన మొదటి మ్యాచ్ లో చోటు దక్కలేదు మాలిక్ కు.
ఇదే సమయంలో సఫారీ దెబ్బకు భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మరో వైపు రిషబ్ పూర్ కెప్టెన్సీపై జహీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇదే సమయంలో బౌలర్లను వాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపించాడు. ఈ తరుణంలో రవిశాస్త్రి(Ravi Shastri Malik) చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
బీసీసీఐ ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం తంటాలు పడుతోంది. ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరో వైపు హార్దిక్ పాండ్యా, చాహల్ ను తీసుకుంది.
కానీ స్టార్ హిట్టర్ గా పేరొందిన సంజూ శాంసన్ ను పట్టంచు కోలేదు. దీనిపై క్రికెట్ వర్గాలు, మాజీ ఆటగాళ్లతో పాటు రవిశాస్త్రి తీవ్రంగా తప్పు పట్టాడు.
ఎందుకంటే భారత ఆటగాళ్లలో ఆస్ట్రేలియాలో అద్భుతంగా ఆడిన చరిత్ర సంజూకు ఉందన్నాడు. ఇక తాజాగా ఉమ్రాన్ మాలిక్ ను వరల్డ్ కప్ కు దూరంగా ఉంచాలని సూచించాడు.
ఎందుకంటే ఇంకా అతడు అనుభవం పొందలేదని, ఇంకా రాటు దేలాల్సిన అవసరం ఉందన్నాడు. వైట్ బాల్, రెడ్ బాల్ పై ట్రైనింగ్ ఇచ్చాక చాన్స్ ఇవ్వాలని సూచించాడు రవి శాస్త్రి.
Also Read : రిషబ్ పంత్ కెప్టెన్సీపై జహీర్ ఫైర్