RBI Governor : వాతావరణ మార్పుపై ఫోకస్ పెట్టాలి
మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి
RBI Governor Economy : ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పు పని తీరుపై భారత దేశం ఎక్కువగా ఫోకస్ పెడుతోందన్నారు. ఇటీవలి కాలంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయారిటీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్. క్లైమేట్ ప్రూఫింగ్ కు కూడా ఇందులో భాగంగా ఉందన్నారు.
వాతావరణ మార్పు పనితీరు సూచిక 2023 ప్రకారం భారత దేశం అత్యధిక ర్యాంకు జి20లో ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా 5వ అత్యుత్తమ పని తీరు కలిగిన దేశంగా పేరు పొందిందన్నారు శక్తికాంత దాస్. 17వ కేపీ హార్మిస్ స్మారక ఉపన్యాసంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత దేశం (RBI Governor Economy) కొనసాగుతోందన్నారు. మన శక్తి డిమాండ్ అనేక రెట్లు పెరగ వచ్చని అభిప్రాయపడ్డారు. తమ ముందు రెండు సవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఒకటి శక్తి రెండు ఇంధనం అని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనాలకు వేగంగా మారాల్సి రావడంపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు.
కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి గ్లోబల్ ఫోరమ్ ల ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ ప్రయత్నాలకు భారత దేశం నాయకత్వం వహిస్తోందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్.
ప్రపంచ జీడీపీలో 85 శాతం , ప్రపంచ వాణిజ్యంలో 75 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జి20కి కొనసాగుతున్న ప్రపంచ సంక్షోభం ఒక అవకాశం, ప్రధాన పరీక్ష అని శక్తి కాంత దాస్ అన్నారు.
Also Read : తృణ ధాన్యాలతో ఆహార భద్రత – మోదీ