RBI Governor : ఆర్బీఐ గవర్నర్ షాకింగ్ కామెంట్స్
ధరా భారం ఇబ్బంది నిజమే
RBI Governor : దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందన్న విషయాన్ని ఒప్పుకున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్. ఇప్పటికే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ తరుణంలో గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రోజు రోజుకు ధరల భారం ఇబ్బంది కలిగిస్తున్న అంశం వాస్తవమేనని ఒప్పుకున్నారు.
అయితే భారత ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని, అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఆర్బీఐ గవర్నర్(RBI Governor). కాగా దాని నుంచి ఎలా బయట పడాలనే దానిపై తాము ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఏడాది సెప్టెంబరర్ లో 7.4 శాతం, ఆగస్టులో 7 శాతం రిటైల ఇన్ ఫ్లేషన్ నమోదు కావడాన్ని లైట్ గా తీసుకున్నారు. విచిత్రం ఏమిటంటే గవర్నర్ వాస్తవాన్ని ఒప్పుకుంటూనే ఇంకో వైపు ఆశాభావం వ్యక్తం చేయడం దారుణం.
ఈసారి ధరా భారం 7 శాతం కంటే తక్కువే ఉంటుందని తాము అనుకుంటున్నామని పేర్కొన్నారు శక్తి కాంత దాస్. కరోనా మహమ్మారి, రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ తరుణంలో భారత్ స్థిరంగా కొనసాగుతోందన్నారు ఆర్బీఐ గవర్నర్.
ఈ సంవత్సరంలో జి20 పగ్గాలు చేపట్టడం విశేషం. ఫారెక్స్ రిజర్వులను ఆర్బీఐ విరివిగా వాడుతోందంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫారిన్ కరెన్సీని వాడు కోవాల్సిన అవసరం లేనే లేదంటూ మరోసారి స్పష్టం చేశారు. బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సెక్టార్ల మద్దతుతో దేశ ఎకానమీ పటిష్టంగా ఉంటుందన్నారు.
Also Read : సింగరేణిని ప్రైవేటీకరించం – మోదీ