RCB IPL 2023 Auction : ఆటగాళ్ల సమతూకం ఆర్సీబీ అందలం
ఈసారైనా ఐపీఎల్ 2023 ఛాంపియన్ అయ్యేనా
RCB IPL 2023 Auction : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సమతూకంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈసారి జరిగిన వేలం పాటలో. ఇంగ్లండ్ బ్యాటర్ విల్ జాక్స్ కు రూ. 3.2 కోట్లు పెట్టింది. రీస్ టోప్లీని రూ. 1.90 కోట్లకు తీసుకుంది ఆర్సీబీ. తమ పర్స్ లో తక్కువ డబ్బులు ఉండడంతో ఎక్కువగా ఆటగాళ్లపై ఫోకస్ పెట్టలేక పోయింది మేనేజ్ మెంట్. జాక్స్ కోసం ఎక్కువ ఖర్చు చేసింది.
ఇక సోనూ యాదవ్ , మనోజ్ భాండాగే , హిమాన్షు శర్మలకు ఒక్కక్కరిని రూ. 20 లక్షలకు తీసుకుంది ఆర్సీబీ(RCB IPL 2023 Auction). విరాట్ కోహ్లీ ఈసారి జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఫాఫ్ డు ప్లెసిస్ కు అప్పగించింది సారథ్య బాధ్యతలను. ఈసారి జరిగిన ఐపీఎల్ లో క్వాలిఫైయర్ -2 కు చేరుకుంది ఆర్సీబీ. కానీ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇక ఐపీఎల్ 2023 వేలం పాటలో ఆర్సీబీ సోనూ సూద్ ను రూ. 20 లక్షలకు, అవినాష్ సింగ్ ను రూ. 60 లక్షలు, రాజన్ కుమార్ రూ. 70 లక్షలు, మనోజ్ భాండాగే రూ. 20 లక్షలు, విల్ జాక్స్ ను రూ. 3.20 కోట్లు, హిమాన్షు శర్మకు రూ. 20 లక్షలు, రీస్ టాప్లీ ని రూ. 1.9 కోట్లకు చేజిక్కించుకుంది.
రిటైన్ చేసిన ఆటగాళ్ల పరంగా చూస్తే డుప్లెసిస్ , కోహ్లీ, ప్రభు దేశాయి, రజత్ పాటిదార్ , దినేష్ కార్తీక్ , అనుజ్ రావత్ , ఫిన్ అలెన్ , గ్లెన్ మాక్స్ వెల్ , వనిందు హసరంగా , షాబాజ్ అహ్మద్ , హర్షల్ పటేల్ , డేవిడ్ విల్లీ, కరుణ్ శర్మ, మహిపాల్ లోమ్ మర్ సిరాజ్ , జోష్ హేజిల్ వుడ్ , సిద్దార్త్ కౌల్ , ఆకాశ్ దీప్ ఉన్నారు.
Also Read : టాప్ ప్లేయర్లకు ‘హైదరాబాద్’ ఛాన్స్