RCB vs PBKS IPL 2023 : బెంగళూరు పంజాబ్ నువ్వా నేనా
ఇరు జట్లకు లీగ్ మ్యాచ్ కీలకం
RCB vs PBKS IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి జట్టు నువ్వా నేనా అన్న రీతిలో పోరాడుతున్నాయి. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB vs PBKS IPL 2023). ఆ జట్టు ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. మూడు మ్యాచ్ లలో ఓడి పోయింది. ఇక పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టు 5 మ్యాచ్ లు ఆడింది. 3 మ్యాచ్ లలో గెలుపొందింది 2 మ్యాచ్ లలో పరాజయం చవి చూసింది.
ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్ వెల్ , కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్బుతమైన ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ పరంగా మహ్మద్ సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం ఆర్సీబీకి ఓ వనరుగా మారింది. పంజాబ్ కింగ్స్ పరంగా చూస్తే ఆ జట్టుకు కెప్టెన్ శిఖర్ ధావన్ బలం. ఈ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఏది ఏమైనా ఐపీఎల్ లో ఇప్పటికే సగం మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇంకా ఉన్నాయి. కప్ ఈసారి ఎవరి స్వంతం అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అన్ని జట్లు సత్తా చాటుతున్నాయి. టైటిల్ వేటకు సై అంటున్నాయి. మొత్తంగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ రాణిస్తుందా లేక ఆర్సీబీ దుమ్ము రేపుతుందా అన్నది సాయంత్రం దాకా తేలనుంది.
Also Read : ఈసారైనా ఢిల్లీ క్యాపిటల్స్ రాణిస్తుందా