RCB vs PBKS IPL 2023 : చితక్కొట్టిన కోహ్లీ దంచికొట్టిన డుప్లెసిస్
పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
RCB vs PBKS IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కానీ తన నిర్ణయం తప్పని తేలింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో భారీగా పరుగులు వచ్చాయి. ఈ ఇద్దరూ 16 ఓవర్ల దాకా క్రీజులోనే ఉన్నారు. పరుగుల వరద పారించారు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 రన్స్ చేసింది ఆర్సీబీ(RCB vs PBKS IPL 2023). స్కోర్ పరంగా చూస్తే విరాట్ కోహ్లీ 47 బంతులు ఎదుర్కొని 59 రన్స్ చేశాడు. ఇక డుప్లెసిస్ అయితే 56 బాల్స్ ఎదుర్కొని 84 పరుగులతో దంచికొట్టాడు. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ తప్ప వేరే బ్యాటర్లు ఎవరూ నిలవలేక పోయారు.
గత మ్యాచ్ లో దంచి కొట్టిన గ్లెన్ మ్యాక్స్ వెల్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఇక ఫినిషర్ గా వచ్చిన దినేష్ కార్తీక్ నిరాశ పరిచాడు. 5 బంతులు ఎదుర్కొని 7 రన్స్ మాత్రమే చేశాడు. మహిపాల్ రామ్ రోర్ 7, షబాజ్ అహ్మద్ 5 రన్స్ మాత్రమే చేశారు. పెవిలియన్ దారి పట్టారు.
Also Read : ఆర్సీబీ స్కిప్పర్ గా రన్ మెషీన్