IPL 2022 Telecast : ఐపీఎల్ పై కన్నేసిన ‘రిలయన్స్..అమెజాన్’
ప్రసార హక్కుల కోసం బరి లోకి దిగే ఛాన్స్
IPL 2022 Telecast : భారతీయ మార్కెట్ ను శాసిస్తున్న దిగ్గజ కంపెనీలు రిలయన్స్ గ్రూప్ , అమెజాన్ సంస్థ ఇప్పుడు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ పై కన్నేశాయి. ఇప్పటికే బెంగళూరు వేదికగా మెగా వేలం ముగిసింది.
ఇక ఈ ఏడాది ఇండియా లోనే ఐపీఎల్ (IPL 2022 Telecast)రిచ్ లీగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ.
పనిలో పనిగా ఐపీఎల్ ప్రసార హక్కుల్ని చేజిక్కించుకునే పనిలో పడ్డాయి ఈ దిగ్గజ సంస్థలు.
ఇప్పటికే రిలయన్స్ ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ ఆల్ రెడీ ఐపీఎల్ లో పాలు పంచుకుంటోంది.
తాజాగా అమెజాన్ ఐపీఎల్ పై కన్నేసింది. ఇప్పటికే ఈ కామర్స్ బిజినెస్ లో వరల్డ్ లో టాప్ లో ఉంది.
ఇండియాలో అతి పెద్ద మార్కెట్ కలిగి ఉంది. అందుకే భారతీయ మార్కెట్ ను శాసించే ఒకే ఒక్క ఆయుధం ఐపీఎల్(IPL 2022 Telecast).
అందుకే ఈ రెండు సంస్థలు దానిపై ఫోకస్ పెట్టాయి. ఐపీఎల్ టెలికాస్ట్ కోసం పోరాడేందుకు సిద్దమయ్యాయి.
ప్రస్తుతం టెలికాస్ట్ హక్కులు స్టార్ ఇండియాకు ఉన్నాయి. రికార్డు స్థాయిలో రూ. 50, 000 కోట్లు కూడా చెల్లించేందుకు సిద్దమైనట్లు సమాచారం.
డిస్నీ యాజమాన్యం లోని స్టార్ ఇండియా, సోని, జీ ఎంటర్ టైన్మెంట్ ఇండియాలో టాప్ బ్రాడ్ కాస్టర్లలో ఒకటిగా ఉంది. 2022 వరకు డిజిటల్, టెలివిజన్ హక్కుల కోసం రూ. 16, 348 కోట్లు చెల్లించింది.
ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ లు వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే రిలయన్స్, అమెజాన్ ల మధ్య వైరం నెలకొంది. ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు విషయంలో కోర్టులో వివాదం నడుస్తోంది.
ఐపీఎల్ బిడ్ వేసేందుకు బీసీసీఐ సిద్దం అవుతోంది. ప్రైమ్ వీడియో ప్లాట్ ఫారమ్ ఇటీవలే లైవ్ స్ట్రీమింగ్ క్రికెట్ మ్యాచ్ లను ప్రారంభించింది అమెజాన్. ఐపీఎల్ టోటల్ గా డిజిటల్, టెలికాస్ట్ పై కన్నేసింది.
Also Read : శ్రీలంకతో సీరీస్ కు భారత జట్టు డిక్లేర్