Revanth Reddy CM : శాసన సభ ఆదర్శ ప్రాయం కావాలి
పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ శాసన సభ దేశంలోనే ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం నూతన స్పీకర్ గా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రకటించారు.
Revanth Reddy Comment
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త సంప్రదాయానికి తెర తీయడం ఆనందంగా ఉందన్నారు. ఇవాళ అన్ని పార్టీలు బేషరతుగా స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇచ్చాయని వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో పరోక్షంగా మద్దతు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు పేర్కొన్నారు.
ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఇది వేదిక కావాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభ్యులు వ్యవహరించాలని స్పష్టం చేశారు. అన్ని పార్టీలకు చెందిన శాసన సభ్యులు స్పీకర్ కు సహకరించాలని పిలుపునిచ్చారు సీఎం. భవిష్యత్తు లోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు.
Also Read : KCR EX CM : ఆస్పత్రిలో ఉన్నా కేసీఆర్ బిజీ