Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి స్వపక్షం నుంచే సపోర్ట్ కరువైనట్లు అనిపిస్తోంది. ఇప్పటి దాకా వన్ మేన్ షో చేస్తూ వచ్చిన రేవంత్ కు ఉన్నట్టుండి నిరసన తగిలింది. అమెరికాలో తానా వేదికగా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, రైతులకు 3 గంటలు మాత్రమే ఇవ్వాలని నోరు పారేసుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ పై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు మిన్నంటాయి. పలుచోట్ల రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఎవరూ రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి ఇప్పటి వరకు మద్దతు ఇవ్వలేదు. కేవలం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ఏ సందర్బంలో అన్నాడో తాను తెలుసుకుంటానని మాత్రం చెప్పాడు. గత రెండు రోజులుగా రాష్ట్రమంతటా రేవంత్ పై నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు.
రేవంత్ రెడ్డి నోటి దూల వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందని, ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చిన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిందని సీనియర్లు వాపోతున్నారని టాక్. కనీసం ఒక్క సీనియర్ నేత బయటకు వచ్చి అది తప్పు అని చెప్పలేక పోయారంటే వారికి ఆయన పట్ల ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకరిద్దరు తప్ప ఏ ఒక్కరూ ఖండించక పోవడం విడ్డూరంగా ఉంది. దీనిపై కార్యకర్తలు సైతం విస్తు పోతున్నారు.
Also Read : Pilot Rohit Reddy : వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి
