Raitu Runa Mafi: లక్షన్నరలోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి రేపే నిధులు జమ !
లక్షన్నరలోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి రేపే నిధులు జమ !
Raitu Runa Mafi: తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూసిన రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది. మొదటి విడతగా లక్ష మేరకు రుణాలు మాఫీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుని.. దాన్ని అమలు చేసింది కూడా. అలాగే జూలై నెలాఖరు వరకు లక్షన్నర.. ఆగష్టు 15 నాటి మొత్తం రెండు లక్షల రుణాబకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.
Raitu Runa Mafi Update in Telangana
ఇక, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా రుణమాఫీపై చర్చ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. రెండు లక్షలలోపు రుణాలను వచ్చే నెలలో జమ చేయనున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి రేపు అసెంబ్లీ ఆవరణలో రైతుల రుణమాఫీపై చెక్కులను ఆవిష్కరించనున్నారు. లక్ష వరకు రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించారు దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read : YS Sharmila: జగన్ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలి – షర్మిల