Revanth VS Uttam : గాంధీ భవన్ లో గరం గరం
రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Revanth VS Uttam : తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా టికెట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రత్యేకించి అభ్యర్థుల ఎంపిక విషయంలో వీరిద్దరూ ఒకరిపై మరొకరు తిట్టుకున్నట్లు సమాచారం.
Revanth VS Uttam Issue
త్వరలో రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ 119 సీట్లకు గాను 115 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి.
అభ్యర్థుల ఎంపికకు సంబంధించి హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పీఈసీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు టికెట్ల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఒకే కుటుంబానికి రెండు టికెట్ల అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్పగా తీవ్ర అభ్యంతరం తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వెళ్లి పోయారు రేవంత్ రెడ్డి.
ఇంకో వైపు మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలంటూ రేణుకా చౌదరి నిలదీశారు. బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తున్నారో చెప్పాలని వి. హనుమంత రావు కోరగా ఏ ప్రాతిపదికన సర్వేలు చేస్తున్నారో చెప్పాలని బలరాం నాయక్ డిమాండ్ చేశారు.
Also Read : ENC Chief : జగన్ ను కలిసిన ఈఎన్సీ చీఫ్