Richa Chadha : గాల్వాన్ ట్వీట్ త‌ప్పైంది..మ‌న్నించండి

క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రిచా చ‌ద్దా

Richa Chadha : ఈ మ‌ధ్య‌న ప్ర‌తి అంశంలో జోక్యం చేసుకోవడం ఆపై తప్పు ఒప్పుకోవ‌డం స‌ర్వ సాధార‌ణంగా మారింది. తాజాగా బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా చేసిన ట్వీట్ దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఆమె చేసిన ట్వీట్ పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్తం కావ‌డంతో గ‌త్యంత‌రం లేక దిగి వ‌చ్చింది న‌టి.

నేను ఈ సంద‌ర్బంగా బాధ పెట్టినందుకు క్ష‌మించ‌మ‌ని వేడుకుంటున్నా. అనుకోకుండా నేను చేసిన ట్వీట్ , వ్య‌క్త ప‌రిచిన అభిప్రాయాలు నా సోద‌రుల‌కు ఇబ్బంది క‌లిగించినందుకు మ‌న్నించ‌మ‌ని కోరుతున్నాన‌ని పేర్కొన్నారు రిచా చ‌ద్దా. నా నానాజీ చైనాకు వ్య‌తిరేకంగా పోరాడారు అంటూ ట్వీట్ చేసింది.

రిచా చ‌ద్దా(Richa Chadha)  చేసిన గాల్వానా ట్వీట్ పెద్ద దుమారం రేగింది. ఇండో చైనా యుద్దంకు సంబంధించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆర్మీలోని సోద‌రుల మ‌నోభావాలు దెబ్బతిన్నందుకు న‌న్ను మ‌న్నించ‌మ‌ని వేడుకుంటున్నాన‌ని తెలిపింది.

ఈ గాల్వానా ట్వీట్ లో ఎవ‌రినీ కించ ప‌ర్చ‌డం లేదా బాధ పెట్ట‌డం త‌న ఉద్దేశం కాద‌ని రిచా చ‌ద్దా స్ప‌ష్టం చేసింది.  ఆర్మీతో త‌న కుటుం సంబంధాల గురించి కూడా పేర్కొంది.

1960ల‌లో ఇండో చైనా యుద్దంలో లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ గా ఉన్న త‌న నానాజీ కాలికి బుల్లెట్ త‌గిలింద‌ని వెల్ల‌డించింది. నా తండ్రి నిజ‌మైన దేశ భ‌క్తుడు అని, అది కూడా నా ర‌క్తంలో ఉంద‌న్నారు రిచా చద్దా(Richa Chadha) .

పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ ను వెన‌క్కి తీసుకోవాల‌ని కోరితే ప్ర‌భుత్వం నుండి ఆదేశాలు వ‌స్తే అమ‌లు చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని భార‌త సైన్యం ప్ర‌క‌ట‌న చేసింది. రిచా చ‌ద్దా దేశ భ‌క్తిని శంకించారు.

Also Read : అస్వ‌స్థ‌త‌కు గురైన క‌మ‌ల్ హాస‌న్

Leave A Reply

Your Email Id will not be published!