Richard Madden : బాలీవుడ్ లో న‌టించాల‌ని ఉంది – మాడెన్

హాలీవుడ్ న‌టుడు కీల‌క కామెంట్స్

Richard Madden : ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు రిచ‌ర్డ్ మాడెన్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బాలీవుడ్ లో న‌టించే ఛాన్స్ వ‌స్తే తాను సంతోషిస్తాన‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచంలో అన్ని దేశాల కంటే భార‌త దేశంలోనే సినిమాలు ఎక్కువ‌గా త‌యార‌వుతాయ‌ని అన్నారు. సిటాడెల్ ప్ర‌మోష‌న్స్ సంద‌ర్భంగా ప్ర‌ముఖ న‌టి ప్రియాంక చోప్రాతో క‌లిసి రిచర్డ్ మాడెన్(Richard Madden) ముంబైలో మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా రిచ‌ర్డ్ మాడెన్ ను మీడియా ప్ర‌శ్నించింది. మీకు అవ‌కాశం ల‌భిస్తే బాలీవుడ్ లో సినిమా చేస్తారా అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు రిచ‌ర్డ్ మాడెన్ . అలా ఎందుకు అనుకుంటున్నారు. ఒక‌వేళ అలాంటి అవ‌కాశం గ‌నుక త‌న‌కు ల‌భిస్తే నిర‌భ్యంత‌రంగా తాను న‌టించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు రిచర్డ్ మాడెన్. ఇక్క‌డ అద్భుత‌మైన ప్ర‌తిభ క‌లిగిన న‌టీన‌టులు ఉన్నార‌ని కితాబు ఇచ్చారు.

ఇక్క‌డ ప‌ని చేయ‌డం వ‌ల్ల త‌న‌కు మ‌రింత గౌర‌వం పెరుగుతుంద‌న్నాడు రిచ‌ర్డ్ మాడెన్. సిటాడెల్ కు సంబంధించి భార‌తీయ అనుస‌ర‌ణ‌లో న‌టించ బోయే వ‌రుణ్ ధావ‌న్ , స‌మంత రూత్ ప్ర‌భు ల‌కు స‌ల‌హా ఇవ్వాల్సిన ప‌ని లేద‌ని పేర్కొంది న‌టి ప్రియాంక చోప్రా. అంత‌కు ముందు స‌హ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ తో క‌లిసి గ‌ల్ల‌న్ గుడియాన్ పాట‌కు డ్యాన్స్ చేసింది.

Also Read : భ‌ద్ర‌కాళిని ద‌ర్శించుకున్న ‘బ‌ల‌గం’ వేణు

Leave A Reply

Your Email Id will not be published!