Ricky Ponting : దాయాదుల పోరుపై పాంటింగ్ కామెంట్
ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమన్న రికీ
Ricky Ponting : యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో భారత్ పైచేయిగా ఉన్నప్పటికీ గత ఏడాది ఇదే వేదికపై జరిగిన టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో ఇండియా ఘోరంగా ఓటమి పాలైంది.
ఈ తరుణంలో ప్రపంచంలో ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. గతంలో ఆసిస్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెన్షన్ ఉండేది.
ఇక భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత కొంత కాలం నుంచీ ఇరు జట్ల మధ్య మ్యాచ్ లు జరగడం లేదు. కేవలం తటస్థ వేదికలపైనే తలపడుతున్నాయి.
తాజాగా జరగబోయే ఆసియా కప్ లో మూడు సార్లు తలపడనున్నాయి. బలాల పరంగా చూస్తే ఇరు జట్లు బలంగానే ఉన్నాయి.
అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో. ఇక పాకిస్తాన్ జట్టుకు బాబర్ ఆజమ్ సారథ్యం వహిస్తుండగా భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు.
ఈ తరుణంలో కోట్లాది మంది క్రీడాభిమానులతో పాటు తాజా, మాజీ ఆటగాళ్లు ఎవరు గెలుస్తారనే దానిపై అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) స్పందించాడు.
ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ వైడ్ గా ఏ జట్ల మధ్య లేనటువంటి ఉత్కంఠ ఒక్క భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగే మ్యాచ్ లపై ఉంటుందన్నాడు. ఏ జట్టు గెలుస్తుందని చెప్పడం ప్రస్తుతం కష్టమన్నాడు.
ఇరు జట్లకు విజయం సాధించేందుకు అవకాశం ఉందన్నాడు. ప్రస్తుతం రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు హెడ్ కోచ్ గా ఉన్నాడు.
Also Read : జోక్ గా మారిన క్రికెట్ జట్టు కెప్టెన్సీ