Ricky Ponting : ‘సూర్య‌’కు నాలుగో స్థాన‌మే బెట‌ర్

ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ రికీ పాంటింగ్

Ricky Ponting : యూఏఈ వేదిక‌గా ఆగ‌స్టు 27 నుంచి ఆసియా క‌ప్ స‌మ‌రం ప్రారంభం కానుంది. ప‌లు జ‌ట్లు పాల్గొంటున్నా ప్ర‌ధానంగా పోటీ మాత్రం దాయాదులైన పాకిస్తాన్, శ్రీ‌లంక‌, భార‌త్ ల మ‌ధ్యే ఉండ‌నుంది.

ఇప్ప‌టికే కోట్లాది మంది భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఈనెల 28న జ‌రిగే కీల‌క మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఆసియా కప్ లో ఆడే జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి క్రికెట్ బోర్డులు.

తాజా, మాజీ క్రికెట‌ర్లు ఎవ‌రు కీల‌క‌మైన ఆటగాళ్లో, ఏయే జ‌ట్లు హాట్ ఫెవ‌రేట్ గా ఉంటాయో అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

టీమిండియా వ‌రుస విజ‌యాల‌తో రాణిస్తోంద‌ని ఆ జ‌ట్టుకే చాన్స్ ఎక్కువ‌గా ఉంద‌న్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్.

జ‌ట్టు ప‌రంగా చూస్తే బ‌లంగా ఉంద‌ని అయితే నాలుగో స్థానంలో సూర్య కుమార్ యాద‌వ్ ను పంపిస్తే బాగుంటుంద‌ని సూచించాడు. దీని వ‌ల్ల ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై మ‌రింత ప‌ట్టు పెంచేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు.

రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే ఫ‌స్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ వ‌స్తాడు. ఆ త‌ర్వాత ఇత‌ర ఆట‌గాళ్ల‌ను పంపించాల‌ని నాలుగో డౌన్ లో సూర్య‌ను పంపిస్తే బాగుంటుంద‌ని పేర్కొన్నాడు పాంటింగ్(Ricky Ponting).

యాద‌వ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడ‌ని, ఇటీవ‌ల ఐసీసీ ప్ర‌క‌టంచిన ర్యాంకింగ్స్ లో నెంబ‌ర్ 2లో కొన‌సాగుతున్నాడ‌ని గుర్తు చేశాడు. స‌వాళ్ల‌ను స్వీక‌రించ‌డంలో, ప్ర‌త్య‌ర్థుల‌పై ఎదురు దాడికి దిగ‌డంలో సూర్య కుమార్ ముందుంటాడ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.

Also Read : స్టార్ క్రికెట‌ర్ కెవిన్ ఒబ్రెయిన్ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!