Rohit Sharma : రోహిత్ శర్మ అరుదైన రికార్డ్
మార్టిఫ్ గఫ్టిల్ రికార్డ్ బ్రేక్
Rohit Sharma : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. నాగ్ పూర్ లో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది భారత జట్టు.
ఈ సందర్భంగా జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ(Rohit Sharma) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అజేయంగా 46 రన్స్ చేశాడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత కొంత కాలంగా ఆశించిన మేర ఇన్నింగ్స్ ఆడలేక పోయాడు.
ఇక హిట్ మ్యాన్ చేసిన పరుగుల్లో 4 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ ఫినిషర్ గా పేరొందిన వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఒక ఫోర్ , మరో సిక్స్ తో విజయంలో భాగస్వామ్యం అయ్యాడు.
దీంతో మొదటి మ్యాచ్ మొహాలీలో జరగగా ఆస్ట్రేలియా దుమ్ము రేపింది. ఇక రెండో మ్యాచ్ లో ఆసిస్ పరాజయం పాలైంది. ఇదిలా ఉండగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలుపొందాయి.
ఇక కీలకమైన మూడో మ్యాచ్ కు వేదిక కానుంది హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాపై నాలుగు సిక్సర్లతో రోహిత్ శర్మ మరోసారి గఫ్టిల్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇదిలా ఉండగా పొట్టి ఫార్మాట్ టి20లో రోహిత్ శర్మ(Rohit Sharma) ఇప్పటి వరకు ఈ నాలుగు సిక్సర్లతో కలుపుకుని 176 సిక్సర్లు ఉన్నాయి. అతడి తర్వాత గఫ్టిల్ 172 సిక్సర్లతో ఉండగా క్రిస్ గేల్ 124 సిక్సర్లు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ పేరు మీద 104 సిక్సర్లు ఉన్నాయి. 138 టి20 మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ 3,500 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు.
Also Read : సచిన్ టెండూల్కర్ సిక్స్ సెన్సేషన్