Rohit Sharma BCCI : మానని గాయం రోహిత్ శర్మ దూరం
రెండో టెస్టుకు బీసీసీఐ జట్టు డిక్లేర్
Rohit Sharma BCCI : బంగ్లా టూర్ లో వన్డే సీరీస్ కోల్పోయిన భారత జట్టు మొదటి టెస్టులో బంగ్లాదేశ్ పై ఘన విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్టుల సీరీస్ లో భాగంగా ఆడతాడని భావించిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు(Rohit Sharma) గాయం మానక పోవడంతో దూరమయ్యాడు. మూడో వన్డే ఆడుతున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు రోహిత్ శర్మ.
దీంతో అతడు తొలి టెస్టుకు ఆడలేదు. భారత్ కు తిరిగి వచ్చేశాడు. అతడి స్థానంలో స్టాండ్ ఇన్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. గ్రాండ్ విక్టరీ సాధించడంతో భారత్ దూకుడు ప్రదర్శించేందుకు రెడీగా ఉంది. ఇక కోల్పోయిన పరువును దక్కించు కోవాలని బంగ్లాదేశ్ కూడా సిద్దంగా ఉంది.
ఈ తరుణంలో రెండో టెస్టుకు జట్టును ప్రకటించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) . డిసెంబర్ 22 గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభం అవుతుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇంకో వైపు కండరాలు పట్టేయడంతో నవదీప్ షైనీ కూడా దూరమైనట్లు తెలిపింది బీసీసీఐ.
తాజాగా రెండో టెస్టుకు సంబంధించి ప్రకటించిన జట్టు ఇలా ఉంది. కేఎల్ రాహుల్ కెప్టెన్ కాగా, పుజారా వైస్ కెప్టెన్. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ , కేఎస్ భరత్ , అశ్విన్ , అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ , ఠాకూర్ , సిరాజ్ , ఉమేష్ యాదవ్ , అభిమన్యు ఈశ్వరన్ , సౌరభ్ కుమార్ , జయదేవ్ ఉనాద్కత్ ఉన్నారు.
ఇదిలా ఉండగా తుది జట్టును ఇందులో ఎంపిక చేస్తారు ఆట ప్రారంభం అయ్యే సమయానికి.
Also Read : ఐపీఎల్ వేలంలో ఆ ఆటగాళ్లకే డిమాండ్