Rohit Sharma : సంజూ శాంస‌న్ పై రోహిత్ శ‌ర్మ కితాబు

అద్బుతంగా ఆడాడ‌ని ప్ర‌శంస‌ల జ‌ల్లు

Rohit Sharma : ధ‌ర్మ‌శాల‌లో శ్రీ‌లంక జ‌ట్టుతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది భార‌త జ‌ట్టు. రాబోయే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఎలాగైనా స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతోంది.

ఇప్ప‌టికే వెస్ట్ ఇండీస్ ను మ‌ట్టి క‌రిపించిన టీమిండియా లంక‌పై వ‌రుస‌గా రెండు టీ20 మ్యాచ్ ల‌లో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా, సంజూ శాంస‌న్ అద్భుతంగా రాణించారు.

క‌ళాత్మ‌క‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నారు. శ్రేయాస్ అయ్యార్ 75 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిస్తే సంజూ శాంస‌న్ 39, ర‌వీంద్ర జ‌డేజా 45 ప‌రుగులు చేశారు.

ఇంకా 17 బంతులు మిగిలి ఉండ‌గానే జ‌ట్టు ల‌క్ష్యాన్ని ఛేదించింది. సుదీర్ఘ కాలం త‌ర్వాత మ‌ళ్లీ జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చాడు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చీఫ్ సంజూ శాంస‌న్. లంక సీరీస్ కు ఎంపిక చేసింది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ.

ఇంకా 17 బంతులు మిగిలి ఉండ‌గానే జ‌ట్టు విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇక ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన ఫ‌స్ట్ టీ20 మ్యాచ్ లో ఆడే అవ‌కాశం రాలేదు సంజూ శాంస‌న్ కు. కానీ రెండో టీ20 లో ఆడే అవకాశం ద‌క్కింది.

నాల్గో ప్లేస్ లో వ‌చ్చాడు సంజూ శాంస‌న్. ప‌వ‌ర్ ప్లే లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి అవుట‌య్యాడు. ఇక ఇషాన్ కిషన్ 16 ప‌రుగులే చేసి నిరాశ ప‌రిచాడు.

అప్ప‌టికే క్రీజులో ఉన్న శ్రేయ‌స్ అయ్య‌ర్ కు తోడుగా నిలిచాడు శాంస‌న్. ఈ సంద‌ర్భంగా శాంస‌న్ ఆట తీరుతో ఆక‌ట్టు కోవ‌డాన్ని ప్ర‌త్యేకంగా అభినందించాడు రోహిత్ శ‌ర్మ.

Also Read : వార్న‌ర్ భ‌య్యా మామూలు లేదుగా

Leave A Reply

Your Email Id will not be published!