Rohit Sharma : ఆ ముగ్గురిపై రోహిత్ కీల‌క కామెంట్స్

వారు అద్భుత‌మైన నాయ‌కులని కితాబు

Rohit Sharma  : భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ ముగ్గురు క్రికెట‌ర్ల‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు. రాబోయే రోజుల్లో టీమిండియాకు నాయ‌కులు అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని పేర్కొన్నాడు.

ఆ ముగ్గురు ఎవ‌రో కాద‌ని కేఎల్ రాహుల్, బుమ్రా, రిష‌బ్ పంత్ జ‌ట్టులో కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌తి సారీ ఇలా ఆడ‌మ‌ని చెప్పాల్సిన ప‌ని లేద‌న్నాడు. వీరు ముగ్గురు భార‌త జ‌ట్టుకు ద‌క్కిన ఆణిముత్యాలంటూ కితాబు ఇచ్చాడు.

భ‌విష్య‌త్ అంతా మీదేన‌ని తెలిపాడు. గెలుపును ఓట‌మిని తాను స‌మానంగా చూస్తాన‌ని తెలిపాడు రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma). అవ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్ర‌మే గైడ్ చేస్తా. స‌ల‌హాలు ఇస్తాన‌ని కానీ ఎవ‌రిపై పెత్త‌నం చెలాయించాల‌ని అనుకోన‌ని వెల్ల‌డించాడు.

ప్ర‌తి ఒక్క‌రం భార‌త జ‌ట్టుకు విజ‌యం సాధించాల‌ని కోరుకుంటామ‌న్నారు. కానీ ప‌రిస్థితులు ఒక్కోసారి మ‌న‌కు అనుకూలంగా ఉండ‌వ‌ని అన్నాడు. ప్ర‌త్యేకించి క్రికెట్ లోకి వ‌చ్చాక ప్ర‌తి సారీ నేర్చు కోవాల్సి ఉంటుంద‌న్నారు.

ఎవ‌రూ ఇక్క‌డ ప‌ర్ ఫెక్ట్ కాద‌న్నారు. తాను కెప్టెన్ అయినా ఇంకా ప్ర‌తి ఒక్క‌రి నుంచి నేర్చుకునేందుకు సిద్దంగా ఉంటాన‌ని తెలిపాడు రోహిత్ శ‌ర్మ‌. ఎప్పుడైనా వాళ్ల‌కు ఏమైనా స‌ల‌హాలు ఇవ్వాల్సి వ‌స్తే అప్ప‌టి ప‌రిస్థితులను బ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు.

తమ‌తో పాటు ఆడిన వాళ్లు సీనియ‌ర్ల నుంచి నేర్చుకున్నాం. మీరు కూడా మా నుంచి నేర్చుకునేందుకు సిద్దంగా ఉండాల‌ని సూచించాడు రోహిత్ శ‌ర్మ‌. ఎలాంటి ఒత్తిళ్ల‌కు లోను కాకుండా ఆట‌పైనే ఫోక‌స్ పెట్టాల‌న్నాడు.

Also Read : మ‌రాఠా కేబినెట్ అత్య‌వ‌స‌ర స‌మావేశం

Leave A Reply

Your Email Id will not be published!