RR IPL 2023 Auction : ఆటగాళ్ల సెలెక్షన్ లో సంగక్కర ముద్ర
సమతూకానికే సంజూ శాంసన్ ప్రయారిటీ
RR IPL 2023 Auction : ఈసారి ఐపీఎల్ లో ఊహించని రీతిలో కేరళ స్టార్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ రన్నరప్ గా నిలిచింది. భారీ ఎత్తున ఆటగాళ్లను వదులుకుంది. అదే స్థాయిలో కేరళ లోని కొచ్చిలో జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలం(RR IPL 2023 Auction) పాటలో 9 మంది ఆటగాళ్లను తీసుకుంది.
ప్రధానంగా జట్టులో సమతూకం పాటించేలా ఫోకస్ పెట్టారు హెడ్ కోచ్ అండ్ డైరెక్టర్ శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర, కెప్టెన్ సంజూ శాంసన్. ఈసారి ఎలాగైనా సరే సత్తా చాటాలని కోరుకుంటోంది ఆర్ఆర్.
ఇక కొనుగోలు చేసిన తొమ్మిది మంది ఆటగాళ్లలో నలుగురు విదేశీ ప్లేయర్లు ఉండగా ఐదుగురు దేశీయ ఆటగాళ్లకు ప్రయారిటీ ఇచ్చింది. ఇద్దరు వికెట్ కీపర్లు, బ్యాటర్లు కావడం విశేషం. నోవన్ ఫెరీరా, కునాల్ సింగ్ రాథోడ్ ను ఏరికోరి తీసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ వేలం పాటలో కొనుగోలు చేసిన ఆటగాళ్లలో జో రూట్ , అబ్దుల్ బాసిత్ , ఆకాశ్ వశిష్ట్ , మురుగన్ అశ్విన్ , కేఎం ఆసిఫ్ , ఆడమ్ జంపా, జేసన్ హోల్డర్ , కునాల్ సింగ్ రాథోర్ , ఫెరీరా ఉన్నారు.
ఇక రిటైన్ చేసిన ప్లేయర్లలో సంజూ శాంసన్ కెప్టెన్ కాగా కేసీ కరియప్ప, యుజ్వేంద్ర చాహల్ , ఆర్ చాల్ , కుల్దీప్ యాదవ్ , నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్ , మెక్ కాయ్ , ట్రెంట్ బౌల్ట్ , ప్రసిద్ద్ కృష్ణ , రియాన్ పరాగ్ , ధృవ్ జురెల్ , జోస్ బట్లర్ , దేవదత్ పడిక్కల్ , హెట్మెయర్ , యశస్వి జైశ్వాల్ ఉన్నారు.
Also Read : స్టార్ ఆటగాళ్లపై ‘గుజరాత్’ గురి