RR vs CSK IPL 2023 : అబ్బా రాజస్థాన్ రాయల్స్ దెబ్బ
32 పరుగుల తేడాతో ఓటమి
RR vs CSK IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో వరుస విజయాలతో దూసుకు పోతున్న ధోనీ సేనకు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్(RR vs CSK IPL 2023) నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డాయి. కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన రాజస్థాన్ ఆరంభం నుంచే దూకుడు పెంచింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
మైదానం నలు వైపుల నుంచి షాట్స్ తో అలరించాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ యంగ్ బ్యాటర్ దంచి కొడుతుంటే జోస్ బట్లర్ అలాగే చూస్తుండి పోయాడు. 77 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. బట్లర్ , శాంసన్ ఆశించిన మేర రాణించ లేక పోగా ఆఖరులో వచ్చిన ధ్రువ్ జురైల్ దుమ్ము రేపాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్(RR vs CSK) 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.
అనంతరం మైదానంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ధాటిగా ఆడింది. ఒకానొక దశలో గెలుపు అంచుల దాకా వచ్చింది. కానీ సంజూ శాంసన్ చాలా తెలివిగా బౌలర్లను వాడుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ తలవంచక తప్పలేదు. 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. దీంతో పరాజయం తప్పలేదు చెన్నైకి. పాయింట్ల పట్టికలో ఈ గెలుపుతో రాజస్థాన్ మరోసారి టాప్ లోకి దూసుకెళ్లింది.
Also Read : పంజాబ్ కింగ్స్ లక్నో జెయింట్స్ ఫైట్