RR vs GT IPL 2023 : చెలరేగిన గుజరాత్ తలవంచిన రాజస్థాన్
9 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ విక్టరీ
RR vs GT IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా గుజరాత్ లోని జైపూర్ లో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ . హోం గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. గుజరాత్ బౌలర్ల ధాటికి ప్రధాన బ్యాటర్లు కుప్ప కూలారు. ఏ కోశాన ధీటుగా ఆడలేక పోయారు. నిన్నటి దాకా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సంజూ శాంసన్ సేన ఉన్నట్టుండి గుజరాత్ కు తలంచారు. బౌలర్లను ఎదుర్కోలేక తల్లడిల్లారు. ఒక రకంగా డిఫెన్స్ కూడా ఆడేందుకు ఛాన్స్ ఇవ్వలేదు ప్రత్యర్థి జట్టు.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లు ఆడకుండానే 17.5 ఓవర్లకే చాప చుట్టేసింది. 118 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. గత సీజన్ లోనే కాదు ఈ సీజన్ లో కూడా తనకు ఎదురే లేదని చాటింది గుజరాత్ టైటాన్స్(RR vs GT IPL 2023).
కెప్టెన్ శాంసన్ తీసుకున్న నిర్ణయం తప్పని తేలింది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్ సీజన్ లోనే అత్యల్ప స్కోర్ చేసి చెత్త రికార్డు నమోదు చేసింది. ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. కెప్టెన్ సంజూ శాంసన్ ఒక్కడే అత్యధికంగా 30 రన్స్ చేశాడు. మిగతా ప్లేయర్లు ఎవరూ డబుల్ డిజిట్ ను దాటలేదు. జోస్ బట్లర్ 6 బంతులు ఆడి 8 రన్స్ చేశాడు.
సంజూ జైశ్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 2 వికెట్ కు 36 రన్స్ చేశాడు. యశస్వి రనౌట్ అయ్యాడు. 11 బంతులు ఆడి 14 రన్స్ చేశాడు. 20 బంతులు ఆడి శాంసన్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పడిక్కల్ 12 రన్స్ కే వెనుదిరిగాడు. ఆ తర్వాత అంతా వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు. రషీద్ ఖాన్ 3 వికెట్లు తీస్తే నూర్ అహ్మద్ 2, షమీ, హార్దిక్ , లిటిల్ చెరో వికెట్ తీశారు.
Also Read : రషీద్ ఖాన్ కమాల్ రాజస్థాన్ ఢమాల్