RSS National Flag : జాతీయ జెండాతో ఆర్ఎస్ఎస్
సోషల్ మీడియాలో సైతం మార్పు
RSS National Flag : 75 ఏళ్లవుతోంది దేశానికి స్వేచ్ఛ లభించి. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త రాగం అందుకుంది. జాతీయ భావం పెంపొందించడంలో భాగంగా దేశమంతటా జాతీయ జెండా పండుగను చేపట్టింది.
దీనికి హర్ ఘర్ తిరంగా అని పేరు పెట్టింది. ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగుర వేయాలని. ఇందుకు గాను ఇప్పుడు జెండాలను అమ్మకానికి కూడా పెట్టడం వివాదాలకు దారి తీసింది.
హర్యానా సర్కార్ కర్నాల్ రేషన్ డిపో డీలర్ ను సస్పెండ్ చేసింది. రూ. 20 పెట్టి కొంటేనే రేషన్ ఇస్తామని చెప్పడం కలకలం రేపింది. దీనిని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తప్పు పట్టారు.
ఇక బీజేపీ అనుబంధ సంస్థగా పేరొందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 సందర్భంగా అన్ని కార్యాలయాలలో జెండాలను ఎగుర(RSS National Flag) వేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు తన సోషల్ మీడియాలోని అన్ని అకౌంట్లకు సంబంధించిన ప్రొఫైల్ లో త్రివర్ణ పతాకాన్ని జోడించింది. తాజాగా తన అధికారిక ఆర్ఎస్ఎస్ ట్విట్టర్ ఖాతాకు జాతీయ జెండాను చేర్చింది.
ఆర్ఎస్ఎస్ ఏర్పాటు అయ్యాక ఇలా చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దాని సాంప్రదాయ కాషాయ జెండా నుండి జాతయ జెండాగా మార్చింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నందున ఆగస్టు 2 నుండి 15 మధ్య దేశంలోని ప్రతి ఒక్కరు, విదేశాలలో ఉన్న ఎన్నారైలు అంతా తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను జాతీయ జెండాలుగా పెట్టుకోవాలంటూ సూచించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఈ మేరకు ఆర్ఎస్ఎస్ ఈ కీలక మార్పు చేసింది.
Also Read : అమ్మకానికి 20 కోట్ల జాతీయ జెండాలు