Ruchi Patanjali : డీల్ కుదిరింది షేర్ ధ‌ర పెరిగింది

10 శాతం పెరిగిన రుచి సోయా షేర్లు

Ruchi Patanjali : పతంజ‌లి ఆయుర్వేద్ ఫుడ్ రిటైల్ వ్యాపారాన్ని రుచి సోయా విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు రూ. 690 కోట్ల డీల్ కు ఓకే చెప్పింది రుచి సోయా కంపెనీ లిమెటెడ్ బోర్డు. దీంతో రుచి సోయాకు సంబంధంచిన షేర్లు 10 శాతం పెరిగాయి.

రుచి సోయా డైరెక్ట‌ర్ల బోర్డు కంపెనీ పేరును పతంజ‌లి ఫుడ్స్ లిమిటెడ్ గా మార్చాల‌ని నిర్ణ‌యించింది. ప‌తంజ‌లి ఆయుర్వేద్ లిమిటెడ్ ఫుడ్ రిటైల్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు చేసిన ప్ర‌తిపాద‌న‌ను ఆమోదం తెలిపింది రుచి సోయా బోర్డు.

రుచి సోయా యోగా గురు బాబా రామ్ దేవ్ నేతృత్వంలోని పతంజ‌లి గ్రూప్ లో భాగం. ప‌తంజ‌లి 2019లో రుచి సోయా ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ ను కొనుగోలు చేసింది. కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప‌తంజ‌లి ఫుడ్స్ లిమిటెడ్ పేరు ల‌భ్య‌త‌ను ధ్రువీక‌రించింది.

దీంతో పేరు మార్పులో ఎలాంటి అడ్డంకి ఉండ‌ద‌ని తెలిపింది. రెగ్యులేట‌రీ ఫైలింగ్ లో రుచి సోయా ప‌తంజ‌లి ఆయుర్వేద్ తో వ్యాపార బ‌దిలీ ఒప్పందం ( బిజినెస్ ట్రాన్స్ ఫ‌ర్ అగ్రిమెంట్ )పై ఇరు కంపెనీలు సంత‌కాలు చేశాయి.

ప‌తంజ‌లి ఈ విషయాన్ని స్ప‌ష్టం చేసింది. ఆహార రిటైల్ వ్యాపారాన్ని స్లంప్ సేల్ ప్రాతిప‌దిక‌న కొన‌సాగిస్తోంది. ఆహార వ్యాపారం 21 ప్ర‌ధాన ఉత్ప‌త్తుల‌ను క‌లిగి ఉంది.

ప‌తంజ‌లి ఆయుర్వేద్(Ruchi Patanjali) ఆహార రిటైల్ వ్యాపారంలో ప‌దార్థ‌, హ‌రిద్వార్, మ‌హారాష్ట్ర లోని నెవాసాలో ఉన్న త‌యారీ ప్లాంట్ల‌తో పాటు కొన్ని ఆహార ఉత్ప‌త్తుల త‌యారీ, ప్యాకేజింగ్ , లేబులింగ్ , రిటైల్ ట్రేడింగ్ ఉన్నాయి.

Also Read : మ‌రికొన్ని బ్రాండ్ ల‌పై క‌న్నేసిన టాటా

Leave A Reply

Your Email Id will not be published!