Rupee Ends : మరింత క్షీణించిన రూపాయి విలువ
భారత దేశం మరో శ్రీలంక కానుందా
Rupee Ends : భారతీయ రూపాయి విలువ మరింత క్షీణిస్తోంది. ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. గత 10 రోజుల్లో 5వ సారి వరుసగా క్షీణించడం. ఒక రకంగా ద్వీప దేశం శ్రీలంక దేశంలో నెలకొన్న సంక్షోభం భారత దేశంలో కూడా నెలకొందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
ఇది అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి సరకొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 77.73 (Rupee Ends) వద్ద ముగిసింది. గత 10 ట్రేడింగ్ సెషన్ లో ఇది ఐదోసారి ఇలా కావడం.
భారీ లాభాల తర్వాత డాలర్ ఊపిరి పీల్చుకున్నప్పటికినీ దూకుడుగా ఉన్న ఆందోళనలతో ప్రపంచ స్టాక్ లు పతనం అయ్యాయి. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు కఠినతరం చేయడం వల్ల వృద్ధికి అడ్డుకట్ట వేయచ్చని అంచనా.
బ్లూమ్ బెర్గ్ పాక్షికంగా కన్వర్టబుల్ రూపాయి తన జీవితకాల కనిష్టానికి 77.73 వద్ద బలహీన పడిందని సూచించింద.ఇ కాగా కరెన్సీ డాలర్ కు 77.72 వద్ద తాత్కాలికంగా ముగిసినట్లు పీటీఐ నివేదించింది.
ఇక ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ లో , గ్రీన్ బ్యాక్ తో పోలిస్తే రూపాయి 77.72 వద్ద దిగవన ప్రారంభమైంది. ఇంట్రా – సే ట్రేడింగ్ లో కనిష్ట స్థాయి 77. 76 గా ఉండగా గరిష్టంగా 77.63 మధ్య ఉంది.
ద్రవ్యోల్బణం, ఆర్థిక మంద గమనంపై నెలకొన్న ఆందోళనల కారణంగా గ్రీన్ బ్యాక్ కు వ్యతిరేకంగా రూపాయి రికార్డు స్థాయిలో 77.61 (Rupee Ends) వద్ద ముగిసింది. గత పది రోజులలో ఏకంగా ఐదో సారి రూపాయి కనిష్టానికి చేరుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోక పోతే కరెన్సీ నష్టాలు మరింత ఎక్కువగా ఉండేవని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read : మిస్త్రీ పిటిషన్ తిరస్కరణ టాటా స్పందన