Salman Butt : జ‌స్ ప్రీత్ బుమ్రా కంటే ష‌హీన్ బెట‌ర్

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ స‌ల్మాన్ భ‌ట్

Salman Butt : ఐసీసీ తాజాగా వ‌న్డే బౌల‌ర్ల‌కు సంబంధించి ర్యాంకింగ్స్ ను ప్ర‌క‌టించింది. ఇంగ్లాండ్ టూర్ లో దుమ్ము రేపుతూ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్న స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా ఏకంగా టాప్ వ‌న్ లో నిలిచాడు.

ఆల్ టైట్ ఆల్ రౌండ‌ర్ గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాస‌ర్ హుస్సేన్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. దీనిపై తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ స‌ల్మాన్ భ‌ట్.

త‌న యూట్యూబ్ చాన‌ల్ లో బుధవారం ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం క‌లక‌లం రేపింది. త‌మ దేశానికి చెందిన బౌల‌ర్ ష‌హీన్ అఫ్రిదీ బుమ్రాకు తీసి పోడ‌ని స్ప‌ష్టం చేశాడు.

వేగంలోనూ, వికెట్ల‌ను తీయ‌డంలోనే కాదు బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించ‌డంలో టాప్ లో ష‌హీన్ ఉన్నాడ‌ని పేర్కొన్నాడు. బుమ్రా గ్రేట్ బౌల‌ర్ అంటే తాను ఒప్పుకోన‌న్నాడు స‌ల్మాన్ భ‌ట్(Salman Butt).

అయితే జ‌స్ప్రీత్ బుమ్రాతో పాటు ష‌హీన్ అఫ్రిదీ ఇద్ద‌రూ గ్రేట్ బౌల‌ర్లు అంటేనే ఒక్క‌రినే గొప్ప వాడంటూ పేర్కొనడాన్ని త‌ప్పు ప‌ట్టారు. మ‌రో వైపు బుమ్రా గొప్ప బౌల‌ర్ అంటూ స‌చిన్ టెండూల్క‌ర్ పేర్కొనడాన్ని అభ్యంత‌రం తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ష‌హీన్ అఫ్రిదీ వ‌ర‌ల్డ్ లోనే అద్భుత‌మైన ఫాస్ట్ బౌల‌ర్ అని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు స‌ల్మాన్ భ‌ట్(Salman Butt). అనుభ‌వంలో చూసుకున్నా లైన్ లెంగ్త్ ను మెయింటెనెన్స్ చేయ‌డంలో బుమ్రా కంటే అఫ్రిదీ సూప‌ర్ బౌల‌ర్ అని ప్ర‌శంసించాడు మాజీ కెప్టెన్.

ఇదిలా ఉండ‌గా 159 మ్యాచ్ ల‌లో 316 వికెట్లు తీస్తే షాహీన్ అఫ్రిదీ 96 మ్యాచ్ ల‌లో 204 వికెట్లు తీయ‌డం విశేషం.

Also Read : ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో బుమ్రా టాప్

Leave A Reply

Your Email Id will not be published!