Salman Butt Ramiz Raja : రమీజ్ రజాపై సల్మాన్ భట్ సీరియస్
ఆస్ట్రేలియా నుంచి మట్టిని తీసుకు వస్తారా
Salman Butt Ramiz Raja : పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రమీజ్ రజాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు నిప్పులు చెరుగుతున్నారు.
మొన్నటికి మొన్న తన్వీర్ అహ్మద్ రమీజ్ రజా వచ్చాక పీసీబీ పనితీరు ఏమాత్రం మెరుగు పడలేదని ఆరోపించాడు. తాజాగా పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ (Salman Butt Ramiz Raja) నిప్పులు చెరిగాడు.
పాకిస్తాన్ లో ఉన్న క్రికెట్ ఆడే మైదానాలకు సంబంధించి ఆస్ట్రేలియా నుంచి మట్టిని ఎందుకు తీసుకు రావాలని అనుకుంటున్నారో చెప్పాలని నిలదీశాడు.
అయితే దేశంలో డ్రాప్ ఇన్ పిచ్ లను సిద్దం చేసేందుకు అక్కడి నుంచి ఇక్కడికి మట్టి తీసుకు రావాలని రమీజ్ రాజా నిర్ణయం తీసుకున్నారు.
దీనిని తీవ్రంగా తప్పు పట్టారు సల్మాన్ భట్. ప్రస్తుతం సల్మాన్ సింగపూర్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా పని చేస్తున్నాడు. పాకిస్తాన్ లో అన్ని రకాల పిచ్ లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా నుంచి మట్టిని దిగుమతి చేసుకునే బదులు డైమండ్ క్రికెట్ క్లబ్ వంటి వేదికల మట్టిని మేనేజ్ మెంట్ ఉపయోగించాలని సూచించాడు.
దీని వల్ల రవాణా ఖర్చు మిగులుతుందని స్పష్టం చేశాడు. మీరు బౌన్స్ , పేస్ కోసం చూస్తున్నట్లయితే డైమండ్ వేదిక నుంచి మట్టిని తీసుకోవాలని అన్నాడు సల్మాన్ భట్.
ఈ మేరకు తన యూట్యూబ్ చానల్ లో రమీజ్ రాజాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రమీజ్ రజాకు విదేశీ వ్యామోహం ఎక్కువగా ఉందని ఫైర్ అయ్యాడు భట్.
Also Read : ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో బాబర్ టాప్