Samatha Kumbh 2023 : దివ్య సాకేతం సహస్ర పారాయణం
జై శ్రీమన్నారాయణ నామ జపం
Samatha Kumbh 2023 : శంషాబాద్ ముచ్చింతల్ దివ్య సాకేతం భక్త జనసందోహంతో నిండి పోయింది. ఎక్కడ చూసినా భక్త బాంధవులు జై శ్రీమన్నారాయణ నామ స్మరణతో మారు మ్రోగింది. జగత్ గురువుగా వినుతికెక్కిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున సమతా కుంభ్ – 2023 ఉత్సవాలు(Samatha Kumbh 2023) ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 2న మొదలయ్యాయి. ఈనెల 14 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఇక సమతా కుంభ్ -2023 ఉత్సవాలలో భాగంగా ప్రతి రోజూ శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో పూజలు ఘనంగా, వైభవోపేతంగా జరుగుతున్నాయి.
నిన్న గురువారం దివ్య సాకేత క్షేత్రంలో 108 దివ్య దేశాల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు శ్రీ విష్ణు సహస్ర పారాయణం నిర్వహించారు. అంతకు ముందు సమతా స్పూర్తి కేంద్రంలోని ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది.
సాయంత్రం 6.00 గంటల నుండి రాత్రి 8.30 గంటల దాకా గరుడ సేవలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారు భక్తులకు తీర్థ గోష్టి అందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 10 శుక్రవారం ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయన కార్యక్రమం ఉంటుంది.సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటలకు గజ వాహన సేవ, 18 గరుడ సేవలు నిర్వహిస్తారు.
Also Read : ఏబీకేకు రామ్మోహన్ రాయ్ అవార్డు