Samsung Chief Pardon : క్షమాభిక్షను పొందిన శామ్ సంగ్ బాస్
లీజే యోంగ్ అక్రమార్జన కేసులో దోషి
Samsung Chief Pardon : ప్రపంచంలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ గా పేరొందింది శాంసంగ్. సదరు కంపెనీకి బాస్ గా ఉన్నారు లీజే యోంగ్. ఆయన సంస్థను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డారు.
ఈ మేరకు కేసు కూడా నమోదైంది. జైలుకు వెళ్లారు. కాగా లంచం కేసులో దోషింగా తేలిన బిలీయనీర్ రాష్ట్రపతి క్షమాభిక్షను పొందారు.
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు, సహకరించేందుకు అతనికి అవకాశం ఇచ్చేందుకు పునరుద్దరించ బడతారని దక్షిణ కొరియా దేశ న్యాయ శాఖ మంత్రి హాన్ డాంగ్ హూన్ స్పష్టం చేశారు.
రాష్ట్రపతి క్షమాభిక్షను పొందిన విషయాన్ని వెల్లడించారు. ఇదిలా ఉండగా శాంసంగ్ కంపెనీ బాస్ లీజే – యోంగ్ గత ఏడాది జనవరిలో లంచం, అక్రమార్జనకు పాల్పడ్డారు.
ఇది విచారణలో రూఢీ అయ్యింది కూడా. శామ్ సంగ్ గ్రూపు వారసుడు(Samsung Chief Pardon) , ఆ సంస్థకు పూర్తి కాలపు నాయకుడిగా ఉన్నారు లీజే – యోంగ్. ఇవాళ అధ్యక్షుడికి తనకు క్షమాభిక్షను ప్రసాదించమని కోరారని మంత్రి తెలిపారు.
కాగా ఆర్థిక కారణాలపై అవినీతికి పాల్పడిన వ్యాపార నాయకులను విడిపించే దక్షిణ కొరియా సుదీర్ఘ సంప్రదాయానికి తాజా ఉదాహరణ. లీ ఫోర్బ్స్ ప్రకారం $7.9 బిలియన్ల నికర విలువతో ప్రపంచంలోనే 278వ ధనవంతుడు శాంసంగ్ చీఫ్.
18 నెలల జైలు శిక్ష తర్వాత ఆగస్టు 2021లో పెరోల్ పై విడుదలయ్యాడు. అతడికి విధించిన శిక్షలో సగం కంటే ఎక్కువ.
శుక్రవారం క్షమాపణ ఐదేళ్లుగా విధించిన జైలు అనంతర ఉద్యోగ పరిమితిని ఎత్తి వేయడం ద్వారా అతను తిరిగి తన విధుల్లో చేరేందుకు మార్గం ఏర్పడింది.
Also Read : ఐటీ దాడుల్లో 58 కోట్ల నగదు 38 కిలోల బంగారం