Sanatana Dharma Comment : సనాతన ధర్మం వివాదం
హాట్ టాపిక్ గా మారిన ఉదయనిధి
Sanatana Dharma Comment : ఏది ధర్మం..ఏది న్యాయం.. ఏది మతం..ఏది కులం.. ఏది మానవత్వం..ఏది హిందూత్వం అన్నది మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మనుషుడే నా మతం అంటూ కవి గానం చేశాడు. ఇది పక్కన పెడితే సనాతన ధర్మం దేశం ముందు చర్చకు వచ్చింది. ఇలా చేయడానికి కారణం ఒకే ఒక్కడు తమిళనాడుకు చెందిన సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin). తాజాగా చెన్నైలో జరిగిన సనాతన ధర్మం నిర్మూలన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇందులో కవులు, రచయితలు, వామపక్ష వాదులు , భావ సారూప్యత కలిగిన వారు పాల్గొన్నారు.
Sanatana Dharma Comment Viral
ఈ సందర్బంగా సనాతన ధర్మం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇది డెంగ్యూ, మలేరియా వ్యాధుల కంటే ప్రమాదకరమని హెచ్చరించాడు. అంతే కాదు నిర్మూలించాలని పిలుపునిచ్చాడు. దేశంలో హిందుత్వం పేరుతో మారణ హోమం కొనసాగుతోందని ఆవేదన చెందాడు. మతం పేరుతో, కులం పేరుతో భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున మనుషులను విడదీసే ప్రయత్నం చేస్తున్నాయంటూ వాపోయారు ఉదయనిధి స్టాలిన్. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. హిందూత్వ వాదులు, సంస్థలు, ధార్మిక సంఘాలు, స్వాములు , బీజేపీ, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ , భజరంగ్ దళ్ భగ్గుమంటున్నాయి.
ఈ సందర్భంగా యూపీలోని అయోధ్యకు చెందిన ప్రముఖ స్వామీజీ పరమహంస ఆచార్య సంచలన ప్రకటన చేశాడు. ఉదయనిధి స్టాలిన్ తలకు వెల కట్టాడు. ఏకంగా ఆయన తల నరికి తీసుకు వచ్చిన వారికి రూ. 10 కోట్ల విరాళం ప్రకటించాడు. ఏపీలో ఉదయనిధిని చెప్పుతో కొట్టిన వారికి రూ.10 లక్షలు బహుమానంగా ఇస్తామని జన జాగరణ సమితి పేరుతో పోస్టర్లు వేశారు. బీజేపీ ఆధ్వర్యంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని కలుసుకుని ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) ను కేబినెట్ నుంచి తొలగించాలని కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా స్పందించాడు ఉదయనిధి.
తాను సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నానని , తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని ప్రకటించాడు. తన తలను తీసుకు వెళ్లేందుకు ఎవరు వస్తారో చూస్తానంటూ స్పష్టం చేశాడు. ఆయన చేసిన తాజా ప్రకటన కలకలం రేపింది. ఇటీవలే కులం , మతం ఎలా మనుషుల్ని బానిసలుగా చేస్తోందనే దానిపై మా మన్నన్ మూవీ తీశాడు ఉదయనిధి స్టాలిన్. మనుషుల్ని విడదీసే సనాతనం ధర్మం ఎందుకు ఉండాలని ప్రశ్నించాడు. ఆయన అన్నదాంట్లో వాస్తవం ఉంది. రచయిత, ఎడిటర్ కిరుతిగను పెళ్లి చేసుకున్నాడు. మొత్తంగా దేశమంతటా నానుతున్న ఏకైక పేరు సీఎం స్టాలిన్ తనయుడు కావడం విచిత్రం కాక మరేమిటి. రేపు ఏం జరగబోతోందనేది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : CM MK Stalin : ఉదయనిధి అన్న దాంట్లో తప్పేముంది