Sanath Jayasuriya : పాల‌కులు కారు ప్ర‌జా కంఠ‌కులు – స‌న‌త్

లంకేయుల్ని ప‌ట్టించుకోలేదు

Sanath Jayasuriya : శ్రీ‌లంక సంక్షోభంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు ఆ దేశానికి చెందిన మాజీ స్టార్ క్రికెట‌ర్ స‌న‌త్ జ‌యసూర్య‌(Sanath Jayasuriya). అంతే కాదు ప్ర‌జ‌లు దేశ అధ్య‌క్షుడు గోటబ‌య రాజ‌ప‌క్సే భ‌వ‌నాన్ని ప్ర‌జ‌లు ముట్ట‌డించిన స‌మ‌యంలో ఆయ‌న కూడా పాల్గొన్నారు.

ప్రెసిడెంట్ దిగి పోవాల‌ని డిమాండ్ చేశారు. తాజాగా జాతీయ మీడియాతో జ‌య‌సూర్య మాట్లాడారు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. లంక‌ను విడిచి పెట్ట వ‌ద్ద‌ని, కానీ త‌మ ప‌ద‌వుల నుంచి త‌ప్పు కోవాల‌ని తాము డిమాండ్ చేశామ‌ని చెప్పారు.

రాజీనామా చేస్తామ‌న్నారు. కానీ ఇచ్చిన మాట నిల‌బెట్టు కోలేదంటూ జ‌య‌సూర్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కోల్పోయార‌ని పేర్కొన్నారు. గోట‌బ‌య‌, మ‌హీంద‌, రణిలె విక్ర‌మ సింఘేల‌పై విరుచుకు ప‌డ్డారు.

ఇదిలా ఉండ‌గా స‌నత్ జ‌య‌సూర్య‌తో పాటు శ్రీ‌లంకకు చెందిన మాజీ క్రికెట‌ర్లు రోష‌న్ మ‌హానామా, అర్జున ర‌ణ‌తుంగ‌, మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నేతో పాటు మ‌రికొంద‌రు తాజా పాల‌కుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈనెల 9 త‌ర్వాత దేశంలో జ‌రిగిన నిర‌స‌న‌ల‌కు పూర్తిగా గోట‌బ‌య‌, విక్ర‌మ‌సింఘే పూర్తిగా బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు జ‌య‌సూర్య. ముందు ఆ ప‌ద‌వుల నుంచి వాళ్లు పూర్తిగా త‌ప్పుకుంటేనే ఈ సంక్షోభం స‌మసి పోతుంద‌ని అన్నారు.

రాజీనామా చేయ‌మంటే దేశం విడిచి పారి పోవ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు జ‌య‌సూర్య‌. ఎవ‌రూ కావాల‌ని నిర‌స‌న‌, ఆందోళ‌న చేయాల‌ని అనుకోర‌న్నాడు. ప‌రిస్థితుల ప్ర‌భావం కార‌ణంగానే జ‌నం రోడ్ల‌పైకి వ‌చ్చార‌ని చెప్పారు.

ఎంతో అనుభ‌వం క‌లిగిన వారున్నారు. అంతా కలిసి శాంతి నెలకొల్పేలా చూడాల‌ని సూచించాడు. స‌హాయం చేసినందుకు బార‌త దేశానికి తాను ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తున్నాన‌ని చెప్పాడు జ‌య‌సూర్య‌(Sanath Jayasuriya).

Also Read : పారి పోయినా ‘రాజ‌ప‌క్సే’దే ప‌వ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!