Sandhya Vivek Mohanani : లక్ష్యం గొప్పదైతే విజయం మనదే
ఇవానా వెల్ నెస్ సిఇఓ సంధ్యా వివేక్
Sandhya Vivek Mohanani : సంధ్యా వివేక్ మోహనాని విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్త. ఆమె ఇవానా వెల్ నెస్ స్థాపకురాలు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా. ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఉంటాయి. వాటిని ఎలా వర్కవుట్ చేయాలనే దానిపై అవగాహన ఉండదు. ఒకవేళ ఉన్నా సక్సెస్ త్వరగా రావాలని కోరుకుంటారు. కానీ కష్టపడాలని అనుకోరు.
అతి తక్కువ సమయంలో విజయం దక్కాలని ,కోట్లు తమ చెంతకు చేరాలని ఆశిస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఒక క్రమ పద్దతిలో మనం పని చేసుకుంటూ పోతే సక్సెస్ తనంతకు తానుగా వస్తుందని తాను నమ్మానని చెబుతోంది సంధ్యా వివేక్ మోహనాని(Sandhya Vivek Mohanani).
మొదట వ్యాపారం పేరుతో ప్రారంభించ లేదు. పిల్లలకు సంబంధించి చర్మ సంరక్షణ విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో దీనిని స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు సంధ్యా వివేక్ మోహనాని. యుక్త వయస్సు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అది పెను సవాళ్లతో కూడుకుని ఉన్నది. యవ్వన చర్మానికి సంబంధించిన ప్రతి దానికీ తల్లులు, పిల్లల కోసం ఒక బ్రాండ్ గా ఉండాలని కోరుకున్నామని అందుకే ఇవానా వెల్ నెస్ ను ఏర్పాటు చేశామన్నారు.
మొదటగా నా పిల్లలతోనే ప్రయోగం చేశాను. చిన్నప్పటి నుండి చర్మాన్ని ఎలా సంరక్షించు కోవాలనే దానిపై అవగాహన కల్పించాను. అదే ఇవాళ సక్సెస్ కు కారణమైందని పేర్కొంది సంధ్యా వివేక్(Sandhya Vivek Mohanani). ఇవానా వెల్ నెస్ ఉత్పత్తులు తల్లులు, యుక్త వయస్సులో ఉన్న వారు ప్రేమించేలా, వాడేలా చేశాయని ఆనందం వ్యక్తం చేసింది ఈ వ్యాపారవేత్త.
Also Read : ఈ డేటా సైంటిస్ట్ వెరీ స్పెషల్