Sania Mirza Emotional : ముగిసిన ప్రస్థానం సానియా భావోద్వేగం
కంటతడి పెట్టిన టెన్నిస్ స్టార్
Sania Mirza Emotional : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కంటతడి పెట్టారు(Sania Mirza Emotional) . తన గ్రాండ్ స్లామ్ ల జర్నీ ముగియగానే కన్నీళ్లు ఆపుకోలేక పోయారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్ లో ఓటమి పాలయ్యారు. దీంతో తన ప్రస్థానం ముగిసిందని ప్రకటించింది. ప్రస్తుతం కంట తడి పెట్టడంతో సానియా మీర్జా సోషల్ మీడియాలో టాప్ లో నిలిచింది.
భారత దేశంలోని అత్యుత్తమైన క్రీడా ప్రముఖుల్లో హైదరాబాద్ కు చెందిన టెన్నిస్ స్టార్ ఒకరిగా గుర్తింపు పొందారు. గతంలో క్రికెట్ పరంగా మహమ్మద్ అజహరుద్దీన్ వరల్డ్ వైడ్ గా మోస్ట్ పాపులర్ గా నిలిచారు. ప్రస్తుతం ఇదే విభాగంలో మహ్మద్ సిరాజ్ కొనసాగుతున్నాడు.
ఇక సానియా మీర్జా సోదరిని అజహరుద్దీన్ తనయుడు పెళ్లి చేసుకున్నారు. ఇక సానియా మీర్జా పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ ను వివాహం చేసుకుంది. శుక్రవారం సానియా మీర్జా తాను టెన్నిస్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ , రఫెల్ మాటోస్ ఫైనల్ లో భారత ద్వయం సానియా మీర్జా , రోహన్ బోపన్నలు 7-6 , 6-2 తేడాతో ఓడిపోయారు.
గేమ్ ముగిసిన అనంతరం సానియా మీర్జా జంట బ్రెజిల్ జంటను అభినందించింది. అర్హత సాధించినందుకు వారిని ప్రశంసించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 తో తన గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కాగా 36 ఏళ్ల ఈ క్రీడాకారిణి అద్భుతమైన కెరీర్ కు తెర తీసేందుకు ముందు మరికొన్ని ఈవెంట్ లు ఆడాలని ప్లాన్ చేసింది.
Also Read : క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బాబర్