Sanjay Manjrekar : ఎంఎస్ ధోనీపై మంజ్రేక‌ర్ కామెంట్స్

గుజ‌రాత్ తో కంట్రోల్ తప్పిన కెప్టెన్

Sanjay Manjrekar : భార‌త మాజీ క్రికెట‌ర్ , ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్(Sanjay Manjrekar) షాకింగ్ కామెంట్స్ చేశారు. క్వాలిఫైయ‌ర్ -1 మ్యాచ్ లో భాగంగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో 157 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది గుజ‌రాత్ టైటాన్స్. దీంతో ఆ జ‌ట్టు ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో గెలుపొందిన ముంబై ఇండియ‌న్స్ తో త‌ల‌ప‌డ‌నుంది.

ఇదిలా ఉండ‌గా గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ కొంత అస‌హ‌నానికి గుర‌య్యాడ‌ని పేర్కొన్నాడు. తాను ఇలా ఎప్పుడూ చూడ‌లేద‌న్నాడు. గుజ‌రాత్ ఇన్నింగ్స్ లోని 16వ ఓవ‌ర్ స‌మ‌యంలో ప‌తిర‌ణ ఫీల్డ్ ని వ‌దిలి వెళ్లేందుకు అర్హ‌త లేక పోవ‌డంతో అంపైర్ బౌలింగ్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

దీనిపై కెప్టెన్ ధోనీ అంపైర్ తో సుదీర్ఘంగా సంభాషించాడు. సంభాష‌ణ‌లతో గంద‌రగోళం నెల‌కొంది. దాదాపు 5 నిమిషాలు వృధా అయ్యాయి. శ్రీ‌లంక యువ పేస‌ర్ కి బౌలింగ్ ఇచ్చే విష‌యంపై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండ‌గా కొంత మంది మాజీ క్రికెట‌ర్లు, నిపుణులు ఇదంతా ధోనీ కావాల‌నే చేశాడంటూ కామెంట్స్ చేశారు.

మైదానంలో ఏం జ‌రిగిందో తెలియ‌దు. 9 నిమిషాల పాటు దూరంగా ఉన్నాడు. వాస్త‌వానికి ఆట ఆడిన‌ప్పుడు స‌మ‌యం కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. బ‌హుశా ఇది త‌న‌కు అనుకూలంగా ప‌ని చేస్తుంద‌ని ధోనీ భావించి ఉంటాడ‌ని మంజ్రేక‌ర్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో పేర్కొన్నాడు.

Also Read : Cameroon Green

 

Leave A Reply

Your Email Id will not be published!